తొలి సినిమా నుంచీ తనదైన క్యారక్టరైజేషన్ , డైలాగ్ డెలవరీలో విభిన్నతతో రవితేజ సినిమాలు చేస్తూ హిట్ కొడుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన్ని సక్సెస్ వదిలేసింది. వరసగా సినిమాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఒకటో రెండో ఆడినా..అవి రవితేజ సినిమాల స్దాయి సక్సెస్ కాదు. దాంతో ఆయన తన సినిమాలు ఫెయిల్యూర్స్ కు కారణం కథ,దర్శకుల ఎంపికే అని ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ..దర్శకుడు విఐ ఆనంద్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  

ఇక సినిమా విజయంతో కథ ఎంత ముఖ్యమో ...టైటిల్ కూడా అంతే స్దాయి ప్రాముఖ్యత ఉంటుంది. రవితేజకు ఆ విషయం తెలుసు. ఇడియట్ వంటి నెగిటివ్ టైటిల్స్ తో సూపర్ హిట్స్ ఇచ్చిన చరిత్ర అతనిది. దాంతో ఇప్పుడు మరో టైటిల్ ని తన సినిమాకు ఓకే చేసారని తెలుస్తోంది. అదే డూప్లికేట్.  

‘విక్రమార్కుడు’, ‘కిక్ 2’ మూవీస్‌లో రెండు పాత్రల్లో మెప్పించిన రవితేజ... వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే మూవీలో ద్విపాత్రాభినయంతో  కనిపించచబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ గా రూపొందే ఈ చిత్రంలో తన  డూప్లికేట్ తో రవితేజ పడే ఇబ్బందులు హైలెట్ కానున్నాయి. రెగ్యులర్ ద్విపాత్రాభినయం చిత్రం కాదు ఇది అని తెలుస్తోంది. ఇప్పటిదాకా తెలుగు తెరపై ట్రై చేయని ఓ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

దర్శకుడు వీఐ ఆనంద్ కు..విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా ఆయనకి మంచి పేరుంది. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు లుక్ కాన్సెప్ట్ పోస్టర్ ను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఆ దిశగానే చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్  నటించనున్నారు. అందులో ఒక హీరోయిన్ గా నాభా నటేశ్ ను తీసుకున్నారు. రవి తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమా, తన కెరియర్లో తప్పకుండా ఒక విభిన్నమైన చిత్రం  అవుతుందని రవితేజ భావిస్తున్నాడు.   

ప్రస్తుతం మాస్‌రాజా..శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ విడుదలకు రెడీ చేస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టాడు. ఈ సినిమాలో మాస్‌మహారాజ్ సరసన గోవా బ్యూటీ ఇలియాన నటిస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.