డాషింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ Harish Shankar రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ Mr Bachchan మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించారు. 

డాషింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తన ఫేవరెట్ హీరో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)తో రీయూనియన్ అయిన విషయం తెలిసిందే. మూడోసారి వారి కాంబోలో Mr Bachchan సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే పోస్టర్లను కూడా విడుదల చేసి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ చేశారు. ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. 

ఈరోజే ‘మిస్టర్ బచ్చన్’ మూవీ షూటింగ్ ను ప్రారంభించినట్టు దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పారు. మాస్ మహారాజా సెట్స్ లో అడుగుపెట్టిన వీడియోను పంచుకుంటూ రవితేజతో మొదటిరోజు షూటింగ్ చాలా గొప్పగా ఉండిందని చెప్పుకొచ్చారు. మరోవైపు మేకర్స్ కూడా అదిరిపోయే షెడ్యూల్ తో మూవీని ప్రారంభించారని ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాస్ మహారాజాతో హరీశ్ శంకర్ జెట్ స్పీడ్ లో సినిమా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. 

అటు రవితేజా వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని చూస్తుంటారు.. ఇటు హరీశ్ శంకర్ కూడా యమా స్పీడ్ గానే ఉంటారు. ఇప్పుడు వీరిద్దరి స్పీడ్ కలిసి సినిమాను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక గతంలో వీరి కాంబోలో షాక్, మిరపకాయ వంటి సినిమాలు వచ్చాయి. మిరపకాయ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. 12ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్‌ కాబోతుంది. రవితేజ వంటి మాస్‌, ఎనర్జీకి, హరీష్‌ మాస్‌ యాక్షన్‌ టేకింగ్‌ తోడైతే సినిమా నెక్ట్స్ లెవల్‌ ఉండబోతుందని చెప్పొచ్చు. 

ఇటీవలే టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘మిస్టర్ బచ్చన్’ Mr Bachchan : నామ్ తో సునా హోగా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ చాలా క్రేజీగా ఉంది. పైగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పేరుతో రవితేజ నటిస్తుండటం విశేషం. చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashri Borse) నటిస్తోంది. తనకు ఇదే తొలిచిత్రం కావడం విశేషం. సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Scroll to load tweet…