రవితేజ 68వ చిత్ర టైటిల్ ఆసక్తికరంగా రామారావు అని ఫిక్స్ చేశారు. ఆన్ డ్యూటీ అంటూ క్యాప్షన్ ఇచ్చిన నేపథ్యంలో సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగిగా రవితేజ ఓ భిన్నమైన రోల్ చేయనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగి రామారావుగా రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రవితేజ 68వ చిత్ర టైటిల్ ఆసక్తికరంగా రామారావు అని ఫిక్స్ చేశారు. ఆన్ డ్యూటీ అంటూ క్యాప్షన్ ఇచ్చిన నేపథ్యంలో సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగిగా రవితేజ ఓ భిన్నమైన రోల్ చేయనున్నారు. రవితేజ గతంలో ఎన్నడూ చేయని విధంగా రవితేజ పాత్ర రూపొందించినట్లు తెలుస్తుంది.
టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు చిత్ర బృందం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి, రామారావు చిత్రాన్ని నిర్మిస్తుండగా, శరత్ మండవ దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇటీవలే హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. 2021చివర్లో లేదా 2022 సంక్రాంతి కానుకగా రామారావు చిత్రాన్ని విడుదల చేయాలనేది యూనిట్ ఆలోచనగా తెలుస్తుంది. క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫార్మ్ లోకి వచ్చిన రవితేజ కొత్త ప్రాజెక్ట్స్ మరింత ఆసక్తి రేపుతున్నాయి.
ఇక దర్శకుడు రమేష్ వర్మతో చేస్తున్న ఖిలాడి చిత్రీకరణ చివరి దశలో ఉంది. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఖిలాడి, సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఓ రోల్ చేస్తున్నారు.
