రవితేజ కెరీర్ ప్రారంభంలో డైరక్టర్ అవుదామని ఇండస్ట్రీకు వచ్చారు. అప్పట్లో డైరక్షన్ డిపార్టమెంట్ లో పని చేసేవారు. ఆ తర్వాత ఆర్టిస్ట్ గా ,హీరోగా ఎదిగారు. అయితే అతనిలోని క్రియేటివ్ స్పిరిట్ ఎక్కడికి పోతుంది. చాలా సార్లు తన చేసే సినిమాలకు కొన్ని సీన్స్ అందించటం, డైలాగ్స్ స్వయంగా చెప్పటం వంటివి చేస్తూ వస్తున్నారు. అయితే డైరక్టర్స్ ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకపోవటంతో దాంతో నెగిటివ్ ప్రాపగాండ ఎప్పుడూ రవితేజపై జరగలేదు. 

ఇక ఇప్పుడు తన లోని రచయితను రవితేజ బయిటకు తీస్తున్నారని సమాచారం.  తనే ఓ స్క్రిప్టు రాసి, తనకు బాగా సన్నిహితులైన ఓ డైరక్టర్ చేత డైరక్షన్ చేయించాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు స్క్రిప్టు రైటింగ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. రవితేజ చెప్తూంటే ఇద్దరు రైటర్స్ వాటిని పేపరుపైకి ప్రాపర్ గా ఎక్కిస్తున్నారని ఫిల్స్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ సినిమా రవితేజ క్యారక్టరైజేషన్ చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. 

కెరీర్ విషయానికి వస్తే... వరస పరాజయాల్లో ఉన్న రవితేజ తన తాజా చిత్రం డిస్కో రాజా షూటింగ్ బిజిలో ఉన్న సంగతి తెలిసిందే. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రం కు బడ్జెట్ సమస్యలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటికీ నిర్మాతలు తమ తదుపరి షెడ్యూల్ డిటేల్స్ ప్రకటించినా రూమర్స్ ఆగటంలేదు. 

ఇదిలా ఉంటే గోపిచంద్ మలినేని తో రవితేజ ఓ చిత్రం చేయబోతున్నట్లు సమాచారం. డాన్ శీను, బలుపు చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి హిట్ అయ్యాయి. దాంతో మరోసారి వీరిద్దరు కలిసి ఓ మాస్ ఎంటర్టైనర్ చేయబోతన్నారు.