పెద్ద హీరోతో సినిమా అనేది డైరక్టర్స్ ఎప్పుడూ ఇష్టపడే అంశం. ఎందుకంటే పెద్ద హీరో సీన్ లో ఉంటే బడ్జెట్ కు లోటు ఉండదు. పబ్లిసిటీ, ఫేమ్ కు కొదవ ఉండదు. డైరక్టర్ మారుతి మంచి టాలెంట్ ఉన్నోడే. ఎప్పటి నుంచో పెద్ద హీరోతో హిట్ కొడదామని వెయిట్ చేస్తూ...సినిమాలు చేస్తూ వస్తున్నారు. అప్పటికీ వెంకీతో బాబు బంగారం, నాగచైతన్యతో శైలజా రెడ్డి చేసినా ఏం కలిసి రాలేదు. కానీ ఈ సారి తన కామెడీ టైమింగ్ కు తగ్గ స్టార్ దొరికాడని మురిసిపోతున్నారు. ఆ హీరో ఎవరంటే...

ఈ రోజుల్లో అనే సినిమా మారుతికు డైరక్టర్ గా కెరీర్  ఇస్తే..శైలజా రెడ్డి అనే సినిమా ఆయనకు గ్యాప్ తెచ్చేసింది. అయితే ఆ తర్వాత కసితో సాయి ధరమ్ తేజతో చేసిన ప్రతీ రోజూ పండుగే చిత్రం మారుతిని తిరిగి ఫామ్ లోకి తెచ్చేసింది. అయితే ఆయన నెక్ట్స్ సినిమా మాత్రం ఇన్నాళ్లూ ఖరారు కాలేదు. గత కొద్ది రోజులుగా మారుతి ఏ హీరోకు సినిమా చేయాలనే డైలమోలో ఉన్నట్లు సమాచారం. మంచి టాలెంట్ ఉంది, అంతకు మించి పరిచయాలు, మెగా క్యాంప్ అండ ఉండి కూడా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేకపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా షూటింగ్ కరోనా వల్ల మొదలెట్టకపోయినా సినిమా ఎనౌన్సమెంట్ కూడా చేయలేదు. అయితే తాజాగా ఆయన ఓ హీరో ని ఒప్పించి సినిమా ఫైనల్ చేసుకున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు రవితేజ. 

అయితే  అందుతున్న సమాచారం మేరకు వీరి కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కబోతోంది. రీసెంట్ గా మారుతి, రవితేజ కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేసి వినిపించిన్నట్లు తెలుస్తోంది. భలే భలే మొగాడివోయ్ సినిమాని మించి ఫన్ ఈ సినిమాలో ఉండబోతోందిట.   ప్రస్తుతం రవితేజ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.