అల్లు అర్జున్ మాట్లాడినట్లే సేమ్ టు సేమ్ రవితేజ కూడా...
అల్లు అర్జున్ తన తాజా చిత్రం పుష్పలో చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడుతున్నారు. అలాగే రవితేజ రీసెంట్ హిట్ క్రాక్ లో ఒంగోలు స్లాంగ్ ప్రయత్నం చేసారు. అయితే ఇప్పుడు రవితేజ చిత్తూరు స్లాంగ్ తో తెరపై దుమ్ము రేపనున్నారు.
హీరోలు గతంలో ప్రతీ సినిమాలోనూ ఒకేలా కనపడేవారు,మాట్లాడేవారు. కథలో వేరియేషన్ ఉండాలే తప్ప వారిలో ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం మారుతోంది. క్యారక్టర్ ని బట్టి మొత్తం మార్చేసుకుంటున్నారు. యాస,భాష,రూపం,స్టైల్ మొత్తం కొత్తగా ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్ తన తాజా చిత్రం పుష్పలో చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడుతున్నారు. అలాగే రవితేజ రీసెంట్ హిట్ క్రాక్ లో ఒంగోలు స్లాంగ్ ప్రయత్నం చేసారు. అయితే ఇప్పుడు రవితేజ చిత్తూరు స్లాంగ్ తో తెరపై దుమ్ము రేపనున్నారు. వివరాల్లోకి వెళితే...
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రచయితగా నిరూపించుకున్న శరత్ మండవ కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఉగాది రోజున ప్రారంభమైన ఈ కలయికలో చిత్రాన్ని ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందనుంది.అప్పట్లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దారు దర్శకుడు శరత్. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి.
ఈ చిత్రం చిత్తూరు ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి హీరో చిత్తూరు జిల్లా యాస మాట్లాడితే బాగుంటుందని దర్శకుడు సూచించటంతో రవితేజ ...ప్రాక్టీస్ చేస్తున్నారట. తన గోదావరి జిల్లా యాస కనపడనీయకుండా చిత్తూరు జిల్లా యాసని,పదాలనను పట్టుకుంటున్నారట. అక్కడ పనిచేసే ఓ గవర్నమెంట్ అథికారిగా రవితేజ కనిపించనున్నారు.
‘‘ఈ సినిమా టైటిల్ ఫుల్ మాస్‌గా, ఫస్ట్ లుక్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటాయి. ఇక ఈ మూవీ థీమ్ సాంగ్ అయితే ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. వచ్చే నెలలో షూటింగ్ ఆరంభించే చాన్స్ ఉంది. ఆ తర్వాత మా సినిమా గురించి కొన్ని అప్‌డేట్స్ ఇస్తాం’’ అని పేర్కొన్నారు శరత్.
స్వరకర్త స్యామ్ సీఎస్ నేతృత్వంలో ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నాయి. 1990లనాటి లుక్ కోసం రవితేజ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. ఆయన కనిపించే విధానం కొత్తగా, ఇదివరకెప్పుడూ కనిపించని రీతిలో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.ఇందులో రవితేజకు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారు. అందులో ఒకరు దివ్యాంశ కౌశిక్ . మరొకరి ఎంపికపై దృష్టిపెట్టింది చిత్ర టీమ్. తమిళ చిత్రం 'కర్ణన్'లో నటించిన రాజీషా విజయన్ పేరునూ పరిశీలించినట్టు తెలిసింది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి సత్యన్ సూరన్ కెమెరా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.