Asianet News TeluguAsianet News Telugu

#RaviTeja: ఆ హిట్ రీమేక్ లో రవితేజ, హరీష్ శంకర్ డైరక్షన్

 ఈ సినిమాను హ‌రీష్ శంక‌ర్ (Harish Shankr) డైరెక్ట్ చేయ‌బోవటమే పెద్ద హైలెట్ అని చెప్పాలి. ఆయ‌న ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీ చేస్తున్నారు.  

Ravi Teja takes up a hindi Remake?  jsp
Author
First Published Nov 25, 2023, 4:52 PM IST


రవితేజ తన స్పీడుని రెట్టింపు చేస్తున్నారు. రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావుతో దెబ్బ తిన్న రవితేజ దాని నుంచి త్వరగానే కోలుకున్నారనే చెప్పాలి. ఈ లోగా గోపిచంద్ మలినేని తో సినిమా ప్రారంభం అవుతుందనుకుంటే అది బడ్జెట్ ఇష్యూలతో బ్రేక్ పడింది. దాంతో హరీష్ శంకర్ ని లైన్ పెట్టినట్లు సమాచారం.  ఆ సినిమా ఓ బాలీవుడ్ చిత్రం రీమేక్ అని తెలుస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఈ రీమేక్‌ను రూపొందించ‌నున్నారు.
 
గతంలో  పీపుల్ మీడియా బ్యాన‌ర్‌పై ర‌వితేజ..ధ‌మాకా సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం మాస్ మ‌హారాజా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు మ‌రోసారి ఇదే బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌టానికి ఈ స్టార్ హీరో రెడీ అయిపోయారు.  ఈ సినిమాను హ‌రీష్ శంక‌ర్ (Harish Shankr) డైరెక్ట్ చేయ‌బోవటమే పెద్ద హైలెట్ అని చెప్పాలి. ఆయ‌న ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీ చేస్తున్నారు.  కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో బ్రేక్ పడింది. దాంతో  హ‌రీష్, ర‌వితేజ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు, స్క్రిప్ట్ వ‌ర్క్ లు మొదలెట్టినట్లు  సమాచారం. 

అజయ్‌దేవగన్‌ హీరోగా రాజ్‌ కుమార్‌ గుప్తా దర్శకత్వం వహించిన ‘రైడ్‌’ (2018) సినిమా హిందీలో ఘన విజయం సాధించింది. నిజాయితీ గల ఓ ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌ అమీ పట్నాయక్‌ (అజయ్‌ దేవగన్‌) తనకు ఎదురైన సవాళ్లను ఏ విధంగా సాల్వ్‌ చేశాడన్నదే ‘రైడ్‌’ కథాంశం. ఈ సినిమా తెలుగులో రీమేక్‌ కానుందంటూ చాలా రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కొందరు హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.  అయితే అవేమీ మెటీరియలైజ ్కాలేదు. అయితే తాజాగా మరోసారి ‘రైడ్‌’ రీమేక్‌ ప్రస్తావన తెలుగు ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ .. ‘రైడ్‌’ రీమేక్‌లో రవితేజ చేస్తే పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు.

 ఇదే నిజమైతే వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఇది తెరకెక్కుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతుండడంతో ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ పరిస్థితి ఏంటి? అంటూ నెటిజన్లు అడుగుతున్నారు. పవన్‌ కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ల ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ సినిమాకు సంబంధించి కొన్నిరోజులుగా ఎలాంటి అప్‌డేట్స్‌ రాకపోవడంతో ఇది వాయిదా పడనుందనే అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios