గత ఏడాది చివర్లో ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. ఈ ఏడాది సమ్మర్ లో తన మాస్ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ రావణాసుర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

గత ఏడాది చివర్లో ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. ఈ ఏడాది సమ్మర్ లో తన మాస్ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ రావణాసుర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రవితేజ మర్డర్స్ చేసే లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 7న రావణాసుర చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

రీసెంట్ గా విడుదలైన నాని దసరా చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పక్కా నాటు విలేజ్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజు ఈ చిత్రాన్ని వసూళ్లు కూడా అదిరిపోయాయి. కొన్ని వారాలపాటు ఈ చిత్రం మానియా బాక్సాఫీస్ వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణాలో దసరా చిత్రానికి తిరుగులేదు అనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో రవితేజ రావణాసుర చిత్రానికి పోటీ తప్పేలా లేదు. తెలంగాణాలో దసరా ఎఫెక్ట్ కారణంగా రావణాసుర చిత్రానికి పరిమిత సంఖ్యలోనే థియేటర్స్ దొరికేలా ఉన్నాయి. దీనితో మేకర్స్ ఏపీలో రావణాసుర కోసం స్పెషల్ ప్లానింగ్స్ సిద్ధం చేస్తున్నారు. 

ఏపీలో రావణాసుర చిత్రాని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసి అదనపు షో కూడా ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఐదవ షో కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 4 రెగ్యులర్ షోల తో పాటు మార్నింగ్ 7 గంటల షో కూడా ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల విడుదలైన రావణాసుర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

'మర్డర్ చేయడం క్రైమ్, దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్.. రెస్పెక్ట్ మై ఆర్ట్ బేబీ అంటూ రవితేజ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ లాంటి అందాల భామలు నటిస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.