ఏజ్ పెరుగుతున్నా కొద్ది కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఇంకా స్లిమ్ గా, ఫిట్ గా మెయిటేన్ చేస్తున్నాడు. వరుసగా అప్ డేట్స్ వదులుతూ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.  

టాలీవుడ్ మాస్ మహారాజ్ ర‌వితేజ వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు పక్కాగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరికొన్ని సినిముల సెట్స్ ఎక్కడానికి రెడీగా ఉన్నాయి. ఇక ఆయన తాజా సినిమాల్లో ఒక‌టి రావ‌ణాసుర. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ డైరెక్ట‌ర్ చేస్తున్న ఈ సినిమా యాక్ష‌న్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతుంది.

ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ సర్కిల్ లో తెగ హాల్ చల్ చేస్తోంది. ప్ర‌స్తుతం కొత్త షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న రావణాసుర మూవీ ఆడియో హ‌క్కులు పాపుల‌ర్ మ్యూజిక్ లేబుల్ స‌రిగ‌మప ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం.అంతేకాదు ఈ ఆడియో హ‌క్కుల కోసం ఆసంస్థ కూడా భారీ మొత్తం పెట్టిన‌ట్టు తెలుస్తోంది. 

Scroll to load tweet…

ఇక జాతిర‌త్నాలు ఫేం ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్ గా మాస్ మహారాజ్ సరసన ఆడిపాడుతోంది. అంతే కాదు ఈమూవీలో యంగ్ స్టార్ హీరో సుశాంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీలో మేఘా ఆకాశ్‌, అనూ ఇమ్మాన్యుయేల్ ,ద‌క్షా న‌గార్క‌ర్, పూజిత పొన్నాడ లాంటి స్టార్స్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే రవితేజ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. 

ఈ మూవీతో పాటు శరత్ మండవ డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా చేస్తున్నాడు. అటు త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్ లో ధమాకా మూవీలో కూడా నటిస్తున్నాడు రవితేజ. ఈమూవీ తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. మరికొన్ని సినిమాలు ప్రపొజల్ స్టేజ్ లో ఉన్నాయి. రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ అవ్వగానే మరో సనిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట స్టార్ హీరో.