జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన "చంటబ్బాయ్" సినిమాలో చిరంజీవి చేసిన కామెడీ పాత్రను ఎవ్వరూ మర్చిపోరు. ఆ పాత్రలో ఆయన  పండించిన కామెడీ అదిరిపోయిందనే చెప్తారు.  మెగాస్టార్ కెరీర్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీగా నిలిచిన ఆ చిత్రం తరహాలో మరో సినిమా తయారు కాలేదు. రీసెంట్ గా ఏజెంట్ ఆత్రేయ శ్రీనివాస సినిమా ఆ ఫీట్ చాలా వరకూ సాధించింది. ఇప్పుడు మళ్లీ ... . దాదాపు అదే తరహా పాత్రతో కామెడీ పండించడానికి రెడీ అవుతున్నాడు రవితేజ. రవితేజ అంటేనే కామెడీ ఓ రేంజిలో ఉంటుంది. ఇంక డిటెక్టివ్ కామెడీ అంటే ఇంక ఏ రేంజిలో ఎక్సపెక్ట్ చేయచ్చు. ఆ టైమ్ కామెడీని తమ సినిమాలో చూపించటానికి రెడీ అవుతున్నారు దర్శకుడు త్రినాధరావు. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయబోయే సినిమాలో కామెడీ డిటెక్టివ్ గా కనిపించబోతున్నాడు మాస్ రాజా. ఇలాంటి పాత్ర చేయడం రవితేజకు ఇదే ఫస్ట్ టైమ్ కావటంతో ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు.  ఎంటర్టైన్మెంట్ గా సాగే ఈ సినిమాలో రవితేజకు జోడీగా తమన్నా హీరోయిన్స్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదో కామెక్ థ్రిల్లర్. ఆ సినిమాకు చంటబ్బాయ్ అనే టైటిల్ నే పెట్టే అవకాసం ఉంది అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 
  
ఇక గతకొంతకాలంగా రవితేజ సినిమాలు ఏమీ చెప్పుకోదగిన రీతిలో ఆడటం లేదు. దాంతో  సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు రవితేజ. అయితే ఇప్పుడు కరోనా గ్యాప్ లో స్క్రిప్టులు ఎంపిక చేసుకుని మళ్లీ స్పీడు పెంచుతున్నారు. ప్రస్తుతం ‘క్రాక్‌'తో పాటు మరో  రెండు సినిమాల్లో నటిస్తున్నారాయన.   త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంతో రవితేజ మళ్లీ ఫామ్ లోకి వస్తారని అభిమానులు భావిస్తున్నారు.