ఒక హిట్ సినిమా జనాలకు దగ్గరకు తీసుకువస్తుంది. అలాగే ఒక్క ఫ్లాఫ్ సినిమా ..అప్పటి దాకా తన వెనక , ముందు ఉన్న వాళ్లందినీ దూరం చేసేస్తుంది. రవితేజ వరస ఫ్లాఫ్ ల్లో ఉండటంతో ఒకప్పుడు వరస క్యూ కట్టిన నిర్మాతలు మాయమైపోయారు. అలాగే అప్పటిదాకా స్క్రిప్టు పట్టుకుతిరిగినా పట్టించుకోని హీరోలు ఆర్ ఎక్స్ 100 హిట్ తో దర్శకుడు అజయ్ భూపతి వెనక పడ్డారు. అయితే చిత్రంగా రవితేజనే ఈ దర్శకుడుకి దిక్కయ్యారు. ఎంతో మంది హీరోలు చుట్టూ తిరిగినా సెట్ కాని ప్రాజెక్టు కు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది పూరి జగన్నాథ్ చెప్పటం వల్ల అని జనం గోళ్లు, చెవులు కొరుక్కుంటున్నారు. ఏదైమైనా ప్రాజెక్టు సెట్ అయ్యింది. అలాగే ఈ సినిమాకు మరో చిత్రం చోటు చేసుకుంది.

సాధారణంగా రవితేజ సినిమాల హిట్,ఫ్లాఫ్  ఎలా ఉన్నప్పటికీ.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గడు . మొన్న వచ్చిన  "నేలటిక్కెట్టు" సినిమా డిజాస్టర్ అయిన తర్వాత కూడా రవితేజ వెనకడుగు వేసింది లేదు. తనకు ఇంతకావాలి అని డిమాండ్ చేసి మరీ  రెమ్యూనరేషన్  తీసుకున్నాడు. కానీ సిట్యువేషన్ మరీ బ్యాడ్ అయ్యిపోయింది. నిర్మాతల నుంచి ఫోన్స్ రావటం దేవెడురుగు, తను ఫోన్ చేస్తున్నా ఎత్తే పరిస్దితి లేదు. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమా తర్వాత రవితేజకు అది స్పష్టంగా అర్దమైంది. దాంతో ఈ సారి ఎలాగైనా ఓ సెన్సేషన్ హిట్ కొట్టాలనుకున్నాడు. తను హిట్ లో ఉంటే రెమ్యునేషన్ కు లోటేంది. అలా కమిటైందే "మహాసముద్రం" సినిమా. ఆర్ ఎక్స్ 100 డైరక్టర్ తో అయితే తనకు మరో సెన్సేషన్ హిట్ ఖాయమని ఓకే చేసాడు. 

అందుతున్న సమాచారం మేరకు  ఈ సినిమాకు పారితోషికం తీసుకోవడం లేదు రవితేజ. సినిమా రిలీజ్ తర్వాత లాభం వస్తే షేర్ తీసుకుంటాడు. నష్టమొస్తే వదిలేయాలి. ఈ ఎగ్రిమెంట్  పైనే మహాసముద్రం ప్రాజెక్టు సెట్ అయిందంటున్నారు ఇండస్ట్రీ జనం. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. మొత్తానికి  రవితేజ, "మహాసముద్రం"తో తొలిసారి ఇలా షేరింగ్ బేసిస్ లో సినిమా చేస్తున్నాడు.