Ravi Teja: మాస్ మహారాజ్ దూకుడు మామూలుగా లేదు
రవితేజ దూకుడు మామూలుగా లేదు. అప్పుడే ఖిలాడి మూవీకి గుమ్మడికాయ కొట్టేశాడు. నెక్ట్స్ సినిమాల షూటింగ్స్ కూడా పరుగులు పెట్టించడానికి రెడీ అయ్యాడు.
మాస్ మహారాజ్ సినిమా రేస్ లో సూపర్ ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు. వరుస సినిమాలతో హల్ చల్ చేస్తున్నాడు. వయసు పెరుగుతున్నా కొద్ది.. రవితేజ(Ravi Teja )కు ఊపొస్తోంది. ఒక సినిమా పూర్తి కాకముందే మరో రెండు సినిమాలు లైన్ అప్ చేసుకుంటూ.. ఖాళీగా ఉండకుండా బిజీ అయిపోతున్నాడు. అంతే కాదు ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్ లో నటిస్తున్న ఖిలాడి(Khiladi) మూవీ షూటింగ్ ఈ వారంలో కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేయబోతున్నారట.
ప్రస్తుతం ఖిలాడి(Khiladi) సినిమాలో లాస్ట్ షెడ్యూల్ నడుస్తుంది. చివరిగా సాంగ్ షూట్ చేస్తున్నారు టీమ్. ఇప్పటికే ఈమూవీ నుంచి రెండు పాటలను రిలీజ్ చేశారు . ఇక మూడో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. డిసెంబర్ 31న మూడో పాట రిలీజ్ చేస్తామంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు టీమ్. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఖిలాడి నుంచి వచ్చి ప్రతీ అప్ డేట్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
పిబ్రవరి 11న రిలీజ్ కాబోతోంది ఖిలాడి సినిమా. అందుకోసం పనులు చకచకా జరిగిపోతున్నాయి. కొనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ సందడి చేయబోతున్నారు.రవితేజ (Ravi Teja) సరసన హీరోయిన్లుగా మీకాక్షీ చౌదరి,(Meenakshi Chaudhari )డింపుల్ హయతి (Dimple Hayathi)ఆడి పాడుతున్నారు. కీలక పాత్రల్లో అర్జున్ నటిస్తన్నారు. సచిన్ ఖేడ్కర్, ముఖేష్ రుషి, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, అనసూయ, ముఖ్య పాత్రల్లో నటిస్తన్నారు.
రవితేజ ఇక సినిమాలు సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అందుకే మేకర్స్ ను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. ఖిలాడి ఈ వారంలో అయిపోగానే.. ఆల్ రెడీ స్టార్ట్ చేసిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ షూటింగ్ కూడా చకచకా.. కంప్లీట్ చేయబోతున్నారు. ఈ సినిమాను శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ధమాక మూవీ కూడా సెట్స్ ఎక్కబోతుంది. మరో రెండు మూడు కథలను పెండింగ్ లో ఉంచాడు మాస్ మహారాజ్. తగ్గేదే లే అంటున్నాడు.
Also Read :RRR కేరళ ఈవెంట్ లో మెరిసిన సూపర్ హీరో.. రాజమౌళి అంటే అంతే మరి