‘క్రాక్’ కలెక్షన్స్ ..విధ్వంసమే
కొత్త ఏడాదిలో మొదటగా రిలీజైన ఈ సినిమాకు తొలి రోజు రిలీజ్ విషయంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ.. అవి తొలగిపోగానే బాక్సాఫీస్ బ్రద్దలయ్యే రేంజ్ లో రీసౌండ్ వినిపిస్తోంది. సినిమాకు అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ వస్తోంది. కలెక్షన్స్ బాగున్నాయి. అన్నింటికీ మించి తన గత సినిమాల ప్రభావం ఏమీ కలెక్షన్స్ మీద కనపడటం లేదు. జనవరి తొమ్మిది రిలీజ్ అయినా దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన పనిలేదు. ఆదివారమే ‘క్రాక్’కు డే-1గా భావించాలి.
ఈ మద్యకాలంలో ‘రాజా ది గ్రేట్’ మినహాయిస్తే హిట్టే రాలేదు రవితేజ నుంచి. అంతకు ముందు, తర్వాత అన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. చివరగా అయితే టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలు రవితేజకు తీవ్ర నిరాశను మిగిల్చాయి.ఈ నేపథ్యంలో రవితేజ, ఆయన ఫ్యాన్స్ ఆశలన్నీ ‘క్రాక్’ మీదే నిలిచాయి. ట్రైలర్ విడుదల అయ్యేదాకా ఎవరికీ నమ్మకం లేదు. అయితే ట్రైలర్ చూసాక చాలా మంది..ఈ సినిమా వారి ఆకాంక్షలను నిలబెట్టే లాగే ఉందని ఫిక్స్ అయ్యిపోయారు.
దానికి తోడు అయితే కొత్త ఏడాదిలో మొదటగా రిలీజైన ఈ సినిమాకు తొలి రోజు రిలీజ్ విషయంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ.. అవి తొలగిపోగానే బాక్సాఫీస్ బ్రద్దలయ్యే రేంజ్ లో రీసౌండ్ వినిపిస్తోంది. సినిమాకు అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ వస్తోంది. కలెక్షన్స్ బాగున్నాయి. అన్నింటికీ మించి తన గత సినిమాల ప్రభావం ఏమీ కలెక్షన్స్ మీద కనపడటం లేదు. జనవరి తొమ్మిది రిలీజ్ అయినా దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన పనిలేదు. ఆదివారమే ‘క్రాక్’కు డే-1గా భావించాలి.
రవితేజ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన ‘క్రాక్’.. ఆదివారం హౌస్ ఫుల్స్‌తో నడిచింది. ఈ మద్య కాలంలో ఎన్నడూ లేని విధంగా రవితేజ సినిమాకు అతి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. డిస్కో రాజా సినిమాతో పోలిస్తే 2-3 రెట్లు ఎక్కువగా తొలి రోజు ‘క్రాక్’ వసూళ్లు ఉండొచ్చని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
అధికారికంగా ఇంకా ఫిగర్స్ బయటికి రాలేదు కానీ.. శనివారం పడింది ఒక్క షో మాత్రమే.. అది కూడా 50 శాతం ఆకుపెన్సి తో మాత్రమే…! అయినప్పటికీ ఈ చిత్రం కోటి పైనే గ్రాస్ ను 0.59 కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. ఇదే జోరు ఆదివారం నాడు కూడా చూపెట్టి దాదాపు.. 6కోట్ల వరకూ షేర్ తెచ్చుకుందని ట్రేడ్ లో అంటున్నారు.