Asianet News TeluguAsianet News Telugu

Ravi Teja:రవితేజ లూజ్ టాక్, డైరక్టర్ పై గౌరవం లేదా?

 ఈ చిత్రం తర్వాత రవితేజ ఇతర సినిమాలతో బిజీ అయినా శ్రీనువైట్లకి ఆఫర్స్ లేకుండా చేసింది ఆ సినిమా. 

Ravi Teja is mocking his own film, Amar Akbar Anthony
Author
Hyderabad, First Published Jan 3, 2022, 10:04 AM IST


సోషల్ మీడియాలో,ఓపెన్ స్టేజీలపైనా కొన్ని విషయాలు మాట్లాడటానికి చాలా మంది ఇష్టపడరు. ముఖ్యంగా ఒకరిపై కామెంట్స్, వివాదాస్పద విషయాలు చర్చించరు. ఎందుకంటే సరదాగా లేదా ముక్కు సూటిగా చెప్పామనున్న మాటలు కూడా హైలెట్ అయ్యిపోతూంటాయి. ఇది చాలా సార్లు సెలబ్రెటీల విషయంలో జరిగింది. విమర్శల పాలయ్యారు. ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన `అమర్ అక్బర్  ఆంటోని` ఫ్లాఫ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్. రవితేజకి...శ్రీనువైట్లకి సక్సెస్ అనివార్యమైన సమయంలో రిలీజ్ అయిన సినిమా ఇది. చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ చిత్రం తర్వాత రవితేజ ఇతర సినిమాలతో బిజీ అయినా శ్రీనువైట్లకి ఆఫర్స్ లేకుండా చేసింది ఆ సినిమా. తాజాగా ఈ సినిమాపై  నటసింహ  బాలకృష్ణ..రవితేజ సెటైర్లు ఓ రేంజ్ లో వేసారు. బాలయ్య హోస్ట్ గా చేస్తోన్న ఆహా 2.0 ఆన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా విచ్చేసిన రవితేజనే  ముందుగా ఆ సినిమా సెటైర్లు వేయడం మొదలు పెట్టారు. ఇది చాలా మందిని బాధిస్తోంది.

 రవితేజ యుఎస్‌లో ఉన్న ఒక ఫొటోను బాలయ్య ఈ షోలో స్క్రీన్ మీద డిస్‌ప్లే చేసి దాని గురించి చెప్పమని అడిగాడు. అది ఒక సినిమా షూటింగ్‌ టైంలో తీసిన ఫొటో అంటూ.. ఆ సినిమా గురించి ఊహించని వ్యాఖ్యలు చేశాడు రవితేజ. ‘‘ఈ ఫొటో అమెరికాలో తీసింది. ఒక కళాఖండం లాంటి సినిమా షూటింగ్ టైంలో. ఆ కళాఖండం పేరు తెలుసుకోవాలనుందా మీకు? అమర్ అక్బర్ ఆంటోని. అది పెద్ద కళాఖండం’’ అన్నాడు రవితేజ.

ఇందులో నువ్వు అమరా, అక్బరా, ఆంటోనీనా అని బాలయ్య అడగ్గా.. ‘‘మూడూను.. ఆ సినిమా చూడలేదా మీరు’’ అన్నాడు రవితేజ. బాలయ్య చూడలేదని చెప్పగా.. ‘‘మీరేం మిస్సయిపోలేదు. చూడక్కర్లా’’ అన్నాడు మాస్ రాజా. రాడ్ రంబోలానా అని బాలయ్య అంటే.. మామూలు రాడ్ కాదు.. రాడ్డుకే రాడ్ అని రవితేజ ముగించాడు. ఎంత డిజాస్టర్ అయినప్పటికీ.. ‘అమర్ అక్బర్ ఆంటోని’ గురించి మాస్ రాజా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.

Also Read :Ravi Teja Ravanasura : సంక్రాంతికి స్టార్ట్ అవుతున్న రవితేజ రావణాసుర.. అస్సలు తగ్గట్లేగా..?

ఈ వాఖ్యలు విన్న శ్రీను వైట్ల అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. రవితేజది లూజ్ టాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ కెరీర్ లో సూపర్ హిట్స్ అయిన వెంకీ, దుబాయి శ్రీను ఇచ్చిన దర్శకుడు ఓ ఫ్లాఫ్ ఇస్తే ఇలా ట్రోల్ చేయటం పద్దతి కాదంటున్నారు. అసలు రవితేజకు కృతజ్ఞత అనేది లేదని, శ్రీనువైట్ల పై గౌరవం లేదా అని నిలదీస్తున్నారు. మీడియా కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తోంది. మరికొందరు మాత్రం రవితేజ చేసిన ఈ కామెంట్స్ ని బట్టే ఆ సినిమా ఫలితం మాస్ రాజాను ఎంత డిస్టర్బ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు అని సమర్దిస్తున్నారు.

Also Read : RRR:రాజమౌళిపై మండిపడుతున్న ఇండస్ట్రీ పెద్దలు? పెద్ద తలనొప్పే

Follow Us:
Download App:
  • android
  • ios