Asianet News TeluguAsianet News Telugu

శ్రీలీల నాకు ఇక డేట్లు ఇవ్వడం కష్టం.. యంగ్ బ్యూటీని ఆకాశానికెత్తేసిన రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో.. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

Ravi Teja interesting comments on Sreeleela
Author
First Published Dec 19, 2022, 9:19 AM IST

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో.. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ అంతా సూపర్బ్ గా వర్కౌట్ అయింది. దీనితో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

డిసెంబర్ 23న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ తన ఫన్నీ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి పనిచేసిన వారిని పేరు పేరున తనదైన శైలిలో జోక్ లు వేస్తూ అభినందించాడు. 

ఇక శ్రీలీల గురించి రవితేజ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. హుషారు, ఎనర్జీ, ట్యాలెంట్ అన్నీ కలగలిసిన అమ్మాయి శ్రీలీల అని అభినందించారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి శ్రీలీల కెరీర్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అప్పుడు ఆమె నా సినిమాకి డేట్లు ఇస్తుందో లేదో అంటూ రవితేజ ఫన్నీ కామెంట్స్ చేశాడు. 

శ్రీలీల టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయం అంటూ అంతా భావిస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ అదే స్థాయిలో అవకాశాలు అందుకుంటోంది. ధమాకా చిత్రంలో సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అందుకు కారణం శ్రీలీల గ్లామర్ ఆమె డ్యాన్స్ అనే చెప్పొచ్చు. అలాగే ధమాకా చిత్ర విజయంపై రవితేజ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రవితేజ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా వర్కౌట్ కాలేదు. దీనితో ధమాకా విజయం చాలా కీలకం కానుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios