Asianet News TeluguAsianet News Telugu

హీరోగా రవితేజ తమ్ముని కొడుకు, బాధ్యతంతా ఆ డైరెక్టర్ పై పెట్టిన రవితేజ

ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వరుసగా వారసులు ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరికొంత మంది మాత్రం ఊగిసలాటలో ఉన్నారు. అందులో రవితేజ తనయుడు కూడా ఒకడు. ఇక ఇప్పుడ తాజాగా రవితేజ తమ్ముడి కుమారుడు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడట.
 

Ravi teja family for new hero entry in Tollywood
Author
Hyderabad, First Published Jun 27, 2022, 12:30 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో  ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..ఎంతో కష్టపడి తనదైన నటనతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని హీరోగా  కెరీర్ లో దూసుకుపోతున్నారు. హీరో మాస్ మహారాజా రవితేజ మూవీస్ థియేటర్లోకి వచ్చాయంటే ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వుతూ ఎంజాయ్ చేయాల్సిందే. 

ఇక  రవితేజ తరువాత అతని తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా టాక్ నడుస్తోంది. కాని దానిపై క్లారిటీ లేదు. అయితే అంతకంటే ముందు రవితేజ  తమ్ముని కొడుకు మాధవన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇతన్నీ  ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేయాలని  చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని సరైన టైమ్ దొరకలేదు. ముఖ్యంగా లాక్ డౌన్ టైమ్ వల్ల.. చాలా వరకూ వేస్ట్ అవ్వడంతో లేట్ గా.. ఇండస్ట్రీకి ఇంటర్డ్యూస్ అవుతున్నాడు మాధవన్. 

 రమేష్ వర్మ డైరెక్షర్ గా మాధవన్  హీరోగా క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో రవితేజతో రెండు సినిమాలు చేసిన రమేష్ వర్మ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా రవితేజ అతని టాలెంట్ ను చూసి తన తమ్ముడి కొడుకుతో ఎలాగైనా సినిమా తీసి హిట్ కోట్టించాలని చూస్తున్నారు. దీంతో రమేష్ వర్మ పై పూర్తి బాధ్యతలు పెట్టారని తెలుస్తోంది. కాని ఈ సినిమాను రమేష్ వర్మనే డైరెక్ట్ చేస్తాడ లేదా ఇంకెవరనేది ఇప్పటివరకు తెలియలేదు. మరి మాధవన్ అయినా హిట్ కొడతాడో లేదో అనేది మనం చూడాలి.

ఇక  గతంలో..  హీరో రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో 2011లో వీర మూవీ వచ్చింది. కానీ ఈ మూవీ బాక్సాపీస్ వద్ద అంతగా వసూలు చేయలేదు. ఈ మూవీ తర్వాత 8 సంవత్సరాల వరకు రమేష్ కి చెప్పుకోదగ్గ మూవీస్ ఏమీ రాలేదు. తర్వాత రీమేక్ మూవీతో రమేష్ వర్మ కాంబినేషన్ లో రవితేజ మళ్లీ స్క్రీన్ పైకి వచ్చారు. రవితేజతో 2021లో కిలాడీ సినిమా చేశారు. దీంతో రవితేజ ఖాతాలో మరొక ఫ్లాప్ వచ్చి పడింది. ఎక్కువ బడ్జెట్ తో తీసినా బాక్సాపీస్ వద్ద అనుకున్నంత వసూళ్లు మాత్రం చేయలేదు అని చెప్పవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios