రవితేజ్ జోడీగా మారోసారి రాశీ ఖాన్నా.. వైరల్ న్యూస్ లో నిజం ఎంత..?
కొన్ని కాంబినేషన్ లు రిపిట్ అయితే.. సక్సెస్ వాటంతట అదే వస్తుంది. మరికొన్ని కాంబోలు సక్సెస్ అవ్వకపోయినా.. రిపిట్ అవుతూ ఉంటాయి. తాజాగా రవితేజ, రాశీ ఖాన్న కాంబో కూడా ఇలాగే రిపిట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
కొన్ని కాంబినేషన్ లు రిపిట్ అయితే.. సక్సెస్ వాటంతట అదే వస్తుంది. మరికొన్ని కాంబోలు సక్సెస్ అవ్వకపోయినా.. రిపిట్ అవుతూ ఉంటాయి. తాజాగా రవితేజ, రాశీ ఖాన్న కాంబో కూడా ఇలాగే రిపిట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
మాస్ మహారాజా రవితేజకు వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు మలినేని గోపీచంద్. డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు తీసి మంచి హిట్స్ అందించిన గోపీచంద్ మలినేనితో రవితేజ నాలుగో సినిమా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాకు సబందించి లీక్ లు కూడా ఇచ్చారు. అయితే ఈమూవీ గురించి మరో న్యూస్ వైరల్ అవుతోంది.
కాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గురించి ఇప్పుడు ఓ సరికొత్త రూమర్ వైరల్ అవుతుంది. రవితేజకి జోడీగా రాశి ఖన్నాను తీసుకున్నట్టు సమాచారం. అయితేఈ విషయం అధికారికంగా మాత్రం మూవీ టీమ్ ప్రకటించలేదు. కాని వార్తలు మాత్రం వైరల్అవుతున్నాయి. కాని రవితేజ్ పక్కన హీరోయిన్ గా నటించిన రాశీ ఖాన్న.. సెకండ్ హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంటుందా అనేది ఉత్కంటగా మారింది.
ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క పూర్తి వివరాల అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే రవితేజ, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మరొక మూవీ ఈగిల్ ను కూడా చేస్తున్నారు. ఈ మూవీ రానున్న 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది.