Asianet News TeluguAsianet News Telugu

రవితేజ బర్త్ డే స్పెషల్.. ‘రావణసుర’ నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ రిలీజ్!

మాస్ మహారాజ రవితేజ (RaviTeja) నటించి మరో చిత్రం ‘రావణసుర’ రిలీజ్ కు సిద్దమవుతోంది.  ఈరోజు రవితేజ  పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ‘గ్లింప్స్’ రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటోంది.
 

Ravanasura movie glimpse out now!
Author
First Published Jan 26, 2023, 10:49 AM IST

మాస్ మహారాజా  ప్రస్తుతం వరుస చిత్రాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. సీనియర్ హీరోగా హిట్లు అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘ధమాకా’,‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్  బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.  ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘రావణసుర’ (Ravanasura)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిత్రానికి ‘స్వామి రారా’ ఫేమ్ డైరెక్టర్ సుధీర్ వర్మనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఆర్టీ టీమ్ వర్క్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవితేజ, అభిషేక్ నామా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

ఈరోజు మాస్ రాజా పుట్టిన రోజు కావడంతో చిత్రం నుంచి ఓ ప్రత్యేకమైన గ్లింప్స్ ను విడుదల చేశారు. 46 సెకండ్లు కలిగిన ఆ వీడియో థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటోంది. వరుసగా అమ్మాయిలను హత్య చేసే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. రవితేజ డిఫరెంట్ లుక్ లో.. మరింత మాస్ ను పంచుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటోంది. రవితేజ  పుట్టిన రోజున ఈ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ  అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. 

మూవీలో హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ‘రావణసుర’ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన గ్లింప్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. ఇక చిత్రంలో హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజితా పొన్నాడలు నటిస్తుండటం విశేషం. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 2023 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios