ఒక సినిమా హిట్ అయిందంటే ఇక దాని ఆధారంగా చాలా కథలు పుట్టుకొస్తుంటాయి. కానీ కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రం హిట్ అవుతాయి. ఒకప్పుడు దర్శకుడు మారుతి 'ఈరోజుల్లో' వంటి సినిమా తీశాడు. ఆ సినిమా మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నిండిపోయింది. 

ఆ సినిమాకి సంబంధించిన బోల్డ్ పోస్టర్లతో యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేశాడు. ఆయన ఆశించినట్లుగానే సినిమా హిట్ అయింది. ఆ తరువాత అదే తరహాలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ హిట్ అయిన దాఖలాలు లేవు. ఇక ఈ మధ్యకాలంలో బాగా పేరు తెచ్చుకున్న బోల్డ్ సినిమా 'Rx100'. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు, లిప్ లాక్స్ తో పాటు కంటెంట్ కూడా ఉంది.

అది ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో సినిమా సక్సెస్ అయింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు 'Rx100'సినిమా హిట్ అయింది కదా అని.. దాదాపు ఇప్పుడు వస్తోన్న అన్ని చిత్రాల్లో ముద్దు సీన్లు పెట్టేస్తున్నారు. వాటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఫాలో అవుతున్నారు. కొన్ని పోస్టర్లు చూస్తుంటే అసలు ఇది లిప్ లాక్ సీన్ కి పరాకాష్ట అనిపించక మానదు.

తాజాగా ఓ యువ హీరో నటిస్తోన్న 'రథం' అనే సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా 'Rx100'పోకడల్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఈ సినిమాలో కంటెంట్ ఉంటే ఓకే.. అలా కాకుండా కేవలం ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లతో సినిమా హిట్ అవుతున్దనుకుంటే పొరపాటే!