శర్వా కోసం రష్మిక రెమ్యూనరేషన్ షాకిచ్చేలా పెంచేసింది, ఎంతంటే...
తాజాగా శర్వానంద్-రష్మిక కలిసి త్వరలో ఓ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శర్వానంద్, రష్మికతోపాటు ఇతర చిత్ర టీమ్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని సినిమా ప్రారంభించారు. ఆమె ఈ చిత్రం కోసం హైయిస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోందని తెలుస్తోంది.
తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరూ అంటే ఖచ్చితంగా రష్మిక అనే చెప్పాలి. ప్రతీ స్టార్ హీరోతో ఆమె పనిచేస్తున్నారు. వరస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. అదే సమయంలో ఆమె రెమ్యునేషన్ కూడా పెంచుకుంటూ పోతోంది. తాజాగా శర్వానంద్-రష్మిక కలిసి త్వరలో ఓ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శర్వానంద్, రష్మికతోపాటు ఇతర చిత్ర టీమ్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని సినిమా ప్రారంభించారు. ఆమె ఈ చిత్రం కోసం హైయిస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోందని తెలుస్తోంది.
అందుతున్న సమాచారం...రష్మిక ఈ చిత్రం కోసం 1.2 కోట్లు తీసుకోబోతోందని చెప్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె రెమ్యునేషన్ పెంచి తీసుకుంటోందని తెలుస్తోంది. దాంతో రష్మిక..ఈ సినిమా కోసం హైయిస్ట్ రెమ్యునేషన్ తీసుకునుంది.
రామ్‌తో ‘రెడ్’ సినిమా తర్వాత కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న సినిమా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’. గతంలో ఇదే టైటిల్‌తో కృష్ణంరాజు, చిరంజీవి, జయసుధ ప్రధాన పాత్రలో బాలచందర్ దర్శకత్వంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా తెరకెక్కింది. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత అదే ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ టైటిల్‌తో రష్మిక, శర్వానంద్ జోడిగా సినిమా తెరకెక్కుతోంది. SLV సినిమా పతాకంపై ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మహిళ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మికకు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటించబోతున్నట్టు స్సష్టమవుతోంది.
శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వాకి జంటగా ప్రియాంక అరుల్ మోహన్ సందడి చేయనున్నారు. ఇటీవల ‘శ్రీకారం’ షూటింగ్ తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగింది. మరోవైపు ప్రస్తుతం రష్మిక చేతిలో ‘పుష్ప’ చిత్రం ఉంది.