విజయ్‌ దేవరకొండ మదర్‌ మాధవి 50వ పుట్టిన రోజుని గురువారం జరుపుకున్నారు. కేవలం తమ కుటుంబ సభ్యుల మధ్య ఆమె యాభైవ బర్త్ డే వేడుక చాలా సింపుల్‌గా జరిగింది.  విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, విజయ్‌ ఫాదర్‌, ఇతర దగ్గరి బంధువులు మాత్రం ఇందులో పాల్గొన్నారు. అంతా కలిసి పది మంది లోపే ఉన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ తల్లికి స్పెషల్‌గా బర్త్ డే విశెష్‌ చెప్పారు. 

విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ అటూ ఇటు ఉండగా, మధ్య వారి మదర్‌ ఉన్నారు. ఆమె క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకున్నారు. ముగ్గరు కలిసి భారీ షాక్‌ కొట్టినట్టుగా పోజ్‌ ఇచ్చారు. దీంతో మాధవి ఆఫ్‌ సెంచరీ కొట్టినట్టుగా తన హావభావాలను పంచుకున్నారు. ఐపీఎల్‌ సందడి ఓ వైపు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీరు క్రికెట్‌ సీన్‌తో విశెష్‌ చెప్పడం ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సింపుల్‌ బర్త్ డే వేడుకలో టాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా మెరవడం విశేషం. రష్మిక మాత్రమే సెలబ్రిటీ వైపు నుంచి పాల్గొని సందడి చేశారు. దీంతో ఇది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించడంతోపాటు అనేక అనుమానాలను క్రియేట్‌ చేస్తుంది. 

రష్మిక వరుసగా విజయ్‌తో రెండు సినిమాలు చేసింది. `గీతా గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌`. ఇందులో `గీతగోవిందం` బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాల్లో నటించడంతో వీరి మధ్య లవ్‌యాణం సాగుతుందనే గాసిప్‌లు ఆ మధ్య సోషల్‌ మీడియాలో వెల్లువెత్తాయి. దీనిపై రష్మిక నవ్వుతూ కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు రష్మిక మాత్రమే ఈ బర్త్ డే వేడుకలో కనిపించడంతో సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు షికారు చేస్తున్నాయి. మరి విజయ్‌, రష్మిక మధ్య ఏదైనా ఉందా?, లేక కేవలం వీరి మధ్య ఉన్న ఫ్యామిలీ రిలేషన్‌ వల్లే కలిశారా? అన్నది మున్ముందు తేలనుంది. మొత్తానికి ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిందని చెప్పొచ్చు.