Asianet News TeluguAsianet News Telugu

ఛత్రపతి శివాజీ కోడలిగా.. మహారాణి పాత్రలో రష్మికా మందన్న, బాలీవుడ్ యంగ్ హీరో జోడీగా కన్నడ భామ

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మహారాణి అవతారమెత్తబోతున్నారు. గ్లామర్‌ డాల్‌గా తెరపై అలరించిన ఆమె మహారాణిగా తెరపై సందడి చేయనుందట.

Rashmika mandanna next period drama film chhava JMS
Author
First Published Apr 29, 2023, 1:35 PM IST

మహారాణి అవతారమెత్తబోతున్నారు నేషనల్‌ క్రష్‌  రష్మిక మందన్నా. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా  గ్లామర్‌ డాల్‌గా అలరించిన రష్మికా.. చారిత్రాత్మక సినిమాలో కనిపించబోతున్నారు. మహారాణిగా వెండితెరపై సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం  ఆన్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మహారాణి అంటే.. ఆషామాషఈ పాత్ర కాదు.  మరాఠీ యోధుడు.. మరాఠీ రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌  కోడలిగా నటించబోతుందట. ఆయన పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పీరియాడికల్‌ సినిమా రూపొందడానికి ఇప్పటికే  సన్నాహాలు జరుగుతున్నాయి. 

అయితే ఈ మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు  ఛావా  అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.  లక్ష్మణ్‌ ఉటేకర్‌ డైరెక్ట్ చేయబోతున్న ఈసినిమాలో శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్‌ పాత్ర కోసం.. బాలీవుడ్ యంగ్ హీరో  విక్కీ కౌశాల్‌ ను తీసుకున్నట్టు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇక ఆయనభార్య  మహారాణి ఏసుబాయి భోంస్లే పాత్రలో రష్మికా మందన్నా నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. 

భారీ బడ్జెట్ తో.. భారీ స్థాయిలో ఈ చిత్రం  తెరకెక్కబోతుందట. కథ, పాత్రలో డెప్త్‌ తో పాటు పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో.. అన్నీ  నచ్చి రష్మిక ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ పాత్ర కోసం రష్మికా ఇప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టినట్టు సమాచారం. అప్పట్లో ఆడవారు, మహారణులు లైఫ్ స్టైల్ తో పాటు.. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. అప్పటి భాష, యాసలను కూడా ప్రాక్టీస్ చేయడం  పాటు  ప్రత్యేకంగా  శిక్షణ కూడా తీసుకుంటున్నారట రష్మిక. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

రాజ్యాల మీదకు యుద్ధాలు చేయడం కోసం మహారాజ్ చత్రపతి శంభాజీ పక్క దేశాలకు వెళ్లినప్పుడు, రాజ మహల్‌లో రాణిగా ఏసుబాయి  ఎలా ఉండేవారు. అప్పుడు ఆమె ఏదైనా సమస్య వస్తే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ప్రమాదాల నుంచి రక్షించుకోవడం కోసం ఎలాంటి రాజకీయ వ్యూహాలను రచించారు..? లాంటి అనేక  కోణలలో  ఈ సినిమా కథ ఉండేలా స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారట.  ఇక ఇప్పటికే ఈ సినిమా హీరో.. యంగ్ స్టార్  విక్కీ కౌషల్‌ నాలుగు నెలలుగా గుర్రపుస్వారీ, కత్తి యుద్దం, విలువిద్య నేర్చుకుంటున్నారని సమాచారం. ఇక అంతా పక్కాగా స్కెచ్ వేసుకుని.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో  సినిమాను సెట్స్ పైకి తీసుకెల్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈసినిమాతో పాటు రష్మిక  అల్లు అర్జున్‌ పుష్ప-2 తో పాటు.. రణ్‌బీర్‌ కపూర్‌తో యానిమల్‌ సినిమా చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios