Asianet News TeluguAsianet News Telugu

అసహనంతో పుష్ప 2 సెట్స్ నుంచి వెళ్లిపోయిన రష్మిక ?.. బన్నీనే కారణం అంటూ షాకింగ్ పోస్ట్, అంత జరిగిందా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెట్ చేసిన క్రేజ్ ని అంతా ఇంతా కాదు. దీనితో పుష్ప ది రూల్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

Rashmika Mandanna left Pushpa 2 shooting for this reason
Author
First Published Mar 17, 2023, 5:49 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే పుష్ప ది రూల్ రిలీజ్ చేసే దిశగా సుక్కు అండ్ టీం వర్క్ చేస్తున్నారు. పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెట్ చేసిన క్రేజ్ ని అంతా ఇంతా కాదు. దీనితో పుష్ప ది రూల్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సుకుమార్.. మొదటి భాగాన్ని మించేలా భారీ కథ అంతకి మించిన యాక్షన్ ఎపిసోడ్స్ తో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. 

Rashmika Mandanna left Pushpa 2 shooting for this reason

ఏదైనా చిత్ర అవుట్ ఫుట్ బాగా రావాలి అంటే లీడ్ పెయిర్ మధ్య సఖ్యత చాలా అవసరం. ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా పండాలి. ఫస్ట్ పార్ట్ లో బన్నీ, రష్మిక జోడికి అంతా జై కొట్టారు. పుష్పరాజ్ గా బన్నీ, శ్రీవల్లిగా రష్మిక అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ అదిరిపోయేలా వచ్చాయి. పుష్ప ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో పుష్ప రాజ్ కి, శ్రీవల్లికి వివాహం జరుగుతుంది. అంటే పుష్ప 2లో వీరిద్దరూ దంపతులుగా నటించబోతున్నారు. 

అల్లు అర్జున్ అంటే క్రమశిక్షణకి మారు పేరు అని అంటుంటారు. షూటింగ్ కి వెళితే దర్శకుడు చెప్పే సన్నివేశం.. దానికి తాను ఎలాంటి పెర్ఫామెన్స్ ఇవ్వగలను అని మాత్రమే అల్లు అర్జున్ ఆలోచిస్తాడని సన్నిహితులు చెబుతుంటారు. పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ డెడికేషన్ ఎలాంటిదో చూశాం. పుష్ప రాజ్ పాత్రని బన్నీ ప్రాణం పెట్టి చేశాడు. అందుకే వరల్డ్ వైడ్ గా ఆ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. మ్యానరిజమ్స్ బాగా హైలైట్ అయ్యాయి. 

Rashmika Mandanna left Pushpa 2 shooting for this reason

అలాంటి అల్లు అర్జున్ పై బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన లేటెస్ట్ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. పుష్ప 2 షూటింగ్ నుంచి రష్మిక అసహనంతో వెళ్లిపోయినట్లు ఉమైర్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ బిహేవియర్ వల్ల ఆమె చాలా ఇబ్బంది పడింది అని కొంతసేపటి తర్వాత షూటింగ్ నుంచి వెళ్లిపోయిందని సంధు ట్వీట్ చేశాడు. 

ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్ చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే చాలా మంది నెటిజన్లు ఉమైర్ సంధు కామెంట్స్ ని విశ్వసించడం లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు నిన్న శ్రీనిధి శెట్టి.. ఉమైర్ సంధుని లెఫ్ట్ షూతో తన్నింది. ఈ రోజు రష్మిక రైట్ షూతో తన్నించుకునేందుకు రెడీగా ఉంటూ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

Rashmika Mandanna left Pushpa 2 shooting for this reason

ఉమైర్ సంధు ఫేక్ న్యూస్ ల ప్రచారం తారాస్థాయికి చేరుతోంది. పవన్ కళ్యాణ్, విజయ్, యష్,  నాగ చైతన్య, సమంత, సల్మాన్ ఖాన్ ఇలా స్టార్స్ ని ఎవ్వరిని విడిచిపెట్టకుండా ఇతడు అసత్య ప్రచారాలు చేస్తున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పై చేసిన ఈ పోస్ట్ తో బన్నీ ఫ్యాన్స్ అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios