విజయ్ దేవరకొండ తమ్ముడికి రష్మిక ఫుల్ సపోర్ట్.. ఆనంద్ దేవరకొండ కోసం ఆ పని చేసిన నేషనల్ క్రష్
బేబీ చిత్రంలో పెర్ఫామెన్స్ తో ఆనంద్ దేవరకొండ ట్రోలర్స్ నోళ్లు మూయించాడు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'గంగం గణేశా'.

బేబీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఆనంద్ దేవరకొండ కూడానా రేసులోకి వచ్చేశాడు. అన్న చాటు తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ వరుసగా విమర్శలు ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. కానీ బేబీ చిత్రంలో పెర్ఫామెన్స్ తో ఆనంద్ దేవరకొండ ట్రోలర్స్ నోళ్లు మూయించాడు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'గంగం గణేశా'.
యాక్షన్ కామెడీ జానర్ తో "గం..గం..గణేశా" సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" సినిమా నుంచి బృందావనివే లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రిలీజ్ చేసింది. ఆనంద్ గత సూపర్ హిట్ ఫిల్మ్ "బేబి"లోని ప్రేమిస్తున్నా సాంగ్ కూడా రష్మికనే విడుదల చేసింది. ఆ సాంగ్ కంటే బృందావనివే పాట బిగ్ హిట్ కావాలని రష్మిక బెస్ట్ విశెస్ తెలియజేసింది. తమ సినిమాలోని పాట రిలీజ్ చేసిన రష్మికకు థాంక్స్ చెప్పారు హీరో ఆనంద్ దేవరకొండ. బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ బృందావనివే మీకు నచ్చుతుందని ఆయన ట్వీట్ చేశారు.
చూస్తుంటే విజయ్ దేవరకొండ తమ్మడికి రష్మిక ఫుల్ సపోర్ట్ ఇస్తోంది అనిపిస్తోంది. ఆనందా ఇది నీ కోసం అంటూ బృందానివే సాంగ్ ని రష్మిక రిలీజ్ చేసింది. ఆల్రెడీ విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది.
విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ కారణంగానే రష్మిక ఆనంద్ దేవరకొండకి ఈ విధంగా ఫుల్ సపోర్ట్ ఇస్తోంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా లేటెస్ట్ సాంగ్ సంగీత ప్రియులని ఆకట్టుకునే విధంగా ఉంది. చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన బృందావనివే పాటకు వెంగి సుధాకర్ లిరిక్స్ అందించారు. సిధ్ శ్రీరామ్ తో కలిసి చేతన్ భరద్వాజ్ ఈ పాట పాడారు.
నటీనటులు :
ఆనంద్ దేవరకొండ,ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్,సత్యం రాజేష్,రాజ్ అర్జున్ తదితరులు.