Asianet News TeluguAsianet News Telugu

Deepfake: డీప్ ఫేక్ వీడియోపై రష్మిక ఫస్ట్ రియాక్షన్.. ఇది మామూలే అనుకున్నా, కానీ వాళ్ళ సపోర్ట్ చూశాక..

హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రష్మికని డీప్ ఫేక్ వీడియో గురించి ప్రశ్నించారు. దీనితో పబ్లిక్ ఫ్లాట్ ఫామ్స్ పై రష్మిక తొలిసారి స్పందించింది.

Rashmika mandanna first reaction on deepfake video dtr
Author
First Published Nov 27, 2023, 4:52 PM IST

రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో సంఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కొందరు సెలెబ్రిటీలని టార్గెట్ చేస్తున్నారు. వారి ముఖాలన్ని మార్ఫింగ్ చేస్తూ వీడియోలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక మందన ముందుగా బలైంది. రష్మిక పేస్ ని ఇంకొకరికి టెక్నాలజీ ద్వారా ఫేక్ చేసి వీడియో ఇంటర్నెట్ లో వదిలారు.

ఈ సంఘటనలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మొట్ట మొదట రష్మికకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు రష్మిక కి సపోర్ట్ చేయడం.. డీప్ ఫేక్ వీడియోల్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీనిపై లీగల్ యాక్షన్స్ కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం రష్మిక రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. 

హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రష్మికని డీప్ ఫేక్ వీడియో గురించి ప్రశ్నించారు. దీనితో పబ్లిక్ ఫ్లాట్ ఫామ్స్ పై రష్మిక తొలిసారి స్పందించింది. ఇలాంటి సంఘటనలు చాలా కాలంగా జరుగుతున్నాయి. నాకు మొట్టమొదట అమితాబ్ బచ్చన్ సర్ స్పందించారు. 

దీని గురించి మొదట స్పందించాలని అనుకున్నప్పుడు ఎవరు పట్టించుకుంటారు అనే భయం వేసింది. ఆ తర్వాత అమితాబ్ సర్, ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ కావడంతో ఇది నార్మల్ కాదు నేను కూడా రియాక్ట్ అవ్వాలి అనుకున్నా. 

అందరి మద్దతు చూశాక నేను చాలా సేఫ్ గా ఫీల్ అయ్యా. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే.. ఇది నార్మల్ కాదు.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సంఘటన జరిగినప్పుడు సైలెంట్ గా ఉండొద్దు. మీకు అందరి మద్దతు ఉంటుంది అని పేర్కొంది. ఎందుకంటే మనం సేఫ్ గా ఉండగలిగే దేశంలో ఉన్నాం అని రష్మిక పేర్కొంది. 

Also Read: శ్రీలీల పరమ రొటీన్.. నితిన్ షాకింగ్ కామెంట్స్, పవన్ ని నా కంటే ఎక్కువ వాడుకున్నది వాళ్లే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios