Asianet News TeluguAsianet News Telugu

Animal : ‘యానిమల్’ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్.. టీజర్ కు టైమ్ ఫిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘యానిమల్’. ఈరోజు ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పోస్టర్ ఆకట్టుకుంటోంది. 
 

Rashmika Mandanna First Look poster from Animal Movie NSK
Author
First Published Sep 23, 2023, 12:59 PM IST

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)  ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలతో సౌత్ లో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. ఇక నార్త్ లోనూ సందడి చేస్తోంది. ‘గుడ్బై’, ‘మిషన్ మజ్ను’ వంటి చిత్రాలతో అక్కడి ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. ఈ క్రమంలో హిందీలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ Animal కోసం రష్మిక మందన్న అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

యానిమల్ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor)  ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గుట్టుగానే యూనిట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తోంది. ఇప్పటికే రన్బీర్ కపూర్ లుక్ తో పోస్టర్లు రిలీజ్ అయ్యి మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. 

కానీ, రష్మిక గురించి అందించే అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా.. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. చీరకట్టులో సంప్రదాయ లుక్ లో నేషనల్ క్రష్ చక్కగా ఉంది. ‘గీతాంజలి’ అనే పాత్రలో ఆకట్టుకోబోతోందని తెలిపారు. పోస్టర్ లో రష్మికను చూస్తే ఆమె రోల్ ను సందీప్ రెడ్డి చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ‘యానిమల్’ నుంచి వరుస అప్డేట్స్ అందుతుండటంతో ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. 

ఇప్పటికే ‘యానిమల్’ నుంచి విడుదలైన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇక మరో ఐదు రోజుల్లో సెప్టెంబర్ 28న ఉదయం 10 గంటలకు టీజర్ ను విడుదల చేయబోతున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానరపై రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 1న హిందీతోపాటు  తెలుగు, తమిళం,  ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios