నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది.
ప్రస్తుతం రష్మికకి నార్త్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. రష్మిక ఎప్పుడూ చిరునవ్వుతో కూల్ గా ఉండే పర్సన్. ఏ ఈవెంట్ లో చూసిన తన చిరునవ్వుతో హృదయాలు దోచుకుంటూ ఉంటుంది. ఇక అభిమానులతో కూడా రష్మిక చాలా జోవియల్ గా ఉంటుంది.
రీసెంట్ గా రష్మిక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రష్మిక చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్మిక షూటింగ్ ముగించుకుని క్యార వ్యాన్ లోకి వెళుతున్న సమయంలో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
రష్మిక మీడియాకు ఫోజులు ఇచ్చిన తర్వాత కొందరు ఫ్యాన్స్ ఆమెతో ఫోటోలు దిగారు. ఇక అన్ని ముగించుకుని క్యార వ్యాన్ లోకి వెళుతుండగా ఓ అభిమాని పరిగెత్తుకుని రష్మిక వద్దకు ఫోటో కోసం వచ్చాడు. దీనితో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతడిని పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశాడు.
దీనితో వెంటనే స్పందించిన రష్మిక సెక్యూరిటీ గార్డ్ పై కాస్త సీరియస్ అయింది. అభిమానిని విడిచిపెట్టమని చెప్పింది. అతడితో కలసి ఫోటోకి ఫోజు ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక ఓపికకి, సహనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తనని అభిమానులు చుట్టుముడుతున్నా ఎంతో ప్రేమగా వారితో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అని ప్రశంసిస్తున్నారు.
