'గీత గోవిందం' చిత్రంతో టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి చేరిపోయిన హీరోయిన్ రష్మిక మందన్నా.. తన నిశ్చితార్ధం రద్దు చేసుకుందంటూ వార్తలు వినిపించాయి. తన కో స్టార్ రక్షిత్ శెట్టిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక అతడితో విడిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.

ఈ విషయంపై రష్మిక తల్లి సుమన్ మందన్నా క్లారిటీ ఇస్తూ.. రష్మిక, రక్షిత్ ల మధ్య విబేధాలు రావడంతో వారి ఎంగేజ్మెంట్ ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రక్షిత్ శెట్టి కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. రష్మికని ఎవరూ టార్గెట్ చేయకూడదని, ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయంపై రష్మిక కూడా మాట్లాడింది.

'బ్రేకప్ జరిగిన విషయం నిజమే. అయితే దానికి గల కారణాలు సమయం వచ్చినప్పుడు చెబుతా. అప్పటిదాకా అందరూ సహనంతో ఉండాలని' కోరింది. కెరీర్ కోసమే ఆమె ఎంగేజ్మెంట్ రద్దు చేసిందని టాక్. ప్రస్తుతం ఆమె నటించిన 'దేవదాస్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అలానే విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది. 

సంబంధిత వార్తలు.. 

రష్మిక గురించి నాకే బాగా తెలుసు.. ఆమెను జడ్జ్ చేయకండి: రక్షిత్ శెట్టి!

హీరో షాకింగ్ డెసిషన్.. కారణం ఆమేనా..?

నిశ్చితార్ధం రద్దయింది.. హీరోయిన్ తల్లి కన్ఫర్మేషన్!