ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయితే.. వారికి ఆఫ్ స్క్రీన్ లో కూడా లింకులు ఉన్నాయంటూ ప్రచారం జరగడం మామూలే. ఇప్పటివరకూ ఈ ట్రెండ్ సినిమాల్లో మాత్రమే కనిపించేది. దీన్ని కూడా ఇప్పుడు బుల్లితెర మీదకు తెచ్చేశారు ఓ జంట. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. పార్టిసిపెంట్ సుధీర్ బాబుల మధ్య ఏదేదో ఉందనే.. ఇంకేదో జరిగిపోతోందని అనే మాదిరిగా చాలానే హింట్స్ కనిపిస్తాయి. 

అటు స్కిట్స్ లోను.. ఇటు డైలాగ్స్ లోను వీరిద్దరికి లవ్వు అన్న మాదిరిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. నిజంగానే వీరిద్దరూ ప్రేమికులు అని జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు. దీన్ని బేస్ చేసుకుని రీసెంట్ గా ఉగాది సందర్భంగా ప్రసారం చేసిన ఓ కార్యక్రమంలో సుధీర్- రష్మిల పెళ్లి చేసేశారు. సంగీత్ నుంచి పెళ్లి వరకు.. చివరకు ఫస్ట్ నైట్ సన్నివేశాన్ని కూడా చూపించారు. దీంతో వీరిద్దరు రియల్ లైఫ్ లో కూడా మ్యారేజ్ చేసుకోబోతున్నారనే ప్రచారం ఎక్కువ అయింది. ఈ అంశంపై ఇప్పుడు రష్మి క్లారిటీ ఇచ్చేసింది. అది కేవలం టీవీ ఎపిసోడ్ లో స్పైస్ నింపడానికి మాత్రమే చేశామని చెప్పింది రష్మి గౌతమ్. 

రష్మి-సుధీర్ ల మధ్య ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏమీ ఉండదని చెబుతున్నారు తోటి వారంతా. రేటింగుల కోసం రియల్ లైఫ్స్ ను బేస్ చేసుకుని ఆన్ స్క్రీన్ పై తెగ డ్రామాలు ఆడేసే ట్రెండ్ తెలుగుతెరపై కూడా మొదలు అయిపోయిందన్న మాట.