బాలీవుడ్ నటి తాప్సీపై కంగనా రనౌత్ సోదరి రంగోలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ ఇంటరెస్టింగ్ గా ఉండడంతో ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో నటి తాప్సీ కూడా ట్రైలర్ బాగుందని ట్వీట్ చేశారు. తాప్సీ ట్వీట్ పై 
స్పందిస్తూ రంగోలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వార్తల్లోకెక్కాయి.

కొంతమంది కంగనాను కాపీ కొడుతూ బతికేస్తున్నారని.. అలాంటి వారు ట్రైలర్ బాగుందని ప్రశంసించేప్పుడు కనీసం కంగనా పేరు కూడా ప్రస్తావించరనితాప్సీని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది. ఓసారి తాప్సీ కంగనను ఉద్దేశిస్తూ ఆమె ఓ అతివాది అని వ్యాఖ్యానించిందని ఫైర్ అయింది. తాప్సీ.. ముందు ఇలా చీప్ గా ఇతరుల వర్క్ ను కాపీ కొట్టడం ఆపండి అంటూ తిట్టిపోసింది.

ఈ విషయంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కలగజేసుకొని రంగోలీని కూల్చేసే ప్రయత్నం చేశాడు. ''రంగోలీ.. ఇది చాలా దూరం వెళుతోంది.. నేను నీ సోదరి కంగనతో, తాప్సీతో కలిసి పని చేశాను. ట్రైలర్ ను మెచ్చుకున్నారంటే.. అందులోని నటీనటులను కూడా మెచ్చుకున్నట్లే కదా..'' అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రంగోలీ.. కంగనా పేరుని ప్రస్తావించారా..? లేదా..? అనేది ఇక్కడ విషయం కాదని.. ఇప్పటివరకు ట్రైలర్ మెచ్చుకున్నవారు కంగనా గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

కంగనాపై కామెంట్లు చేసిన వారితో విసిగిపోయినట్లు.. కంగనా ఓ అతివాది అని అనడానికి తాప్సీ ఎవరని..? అసలు నా సోదరిని పట్టుకొని అంత మాట అంటుందా..? అంటూ  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఎప్పుడూ కంగనాపై కామెంట్స్ చేస్తూనే ఉంటుందని తాప్సీపై మండిపడింది.