సమంత కెరియర్లో 100 కోట్లు కొల్లగొట్టిన 8వ సినిమాగా రంగస్థలం

First Published 3, Apr 2018, 1:20 PM IST
rangasthalam stands eighth hundred crore movie of samantha
Highlights
సమంత కెరియర్లో 100 కోట్లు కొల్లగొట్టిన 8వ సినిమాగా రంగస్థలం

 

తెలుగు .. తమిళ భాషల్లో సమంతకు విపరీతమైన క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లోని అగ్రకథానాయకులతో ఆమె సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఘనవిజయాలను ఆమె సొంతం చేసుకున్నారు. వాటిలో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాలు కూడా వున్నాయి.

గతంలో ఆమె చేసిన '24' .. 'కత్తి' .. 'తెరి' .. 'మెర్సల్' .. 'దూకుడు' .. 'అత్తారింటికి దారేది' .. 'జనతా గ్యారేజ్' సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి .. ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి. తాజాగా వచ్చిన 'రంగస్థలం' కూడా చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. సమంత కెరియర్లో 100 కోట్లను కొల్లగొట్టిన 8వ సినిమాగా నిలిచింది. వసూళ్ల పరంగానే కాకుండా నటన పరంగాను సమంతకు ఈ సినిమా పేరు ప్రతిష్ఠలు తీసుకురావడం విశేషం.   

loader