Asianet News TeluguAsianet News Telugu

`రంగ్‌దే` ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

చెక్ సినిమాతో నిరాశ పరిచిన నితిన్.. నెల తిరక్కుండానే మరో సినిమాతో వచ్చాడు. రంగ్ దే అంటూ కలర్ ఫుల్ సినిమా చేసాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరీ తెరకెక్కించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో అ..ఆ, భీష్మ లాంటి విజయాల తర్వాత నితిన్ చేసిన సినిమా రంగ్ దే. 

Rang De gets a date for OTT streaming jsp
Author
Hyderabad, First Published May 29, 2021, 6:24 PM IST

యేలేటి చంద్రశేఖర్ తో ఎంతో ప్రతిష్ట్తాత్మకంగా చేసిన చెక్ సినిమాతో నిరాశ పరిచారు నితిన్. దాంతో నెల తిరక్కుండానే మరో సినిమాతో వచ్చాడు. రంగ్ దే అంటూ కలర్ ఫుల్ సినిమా చేసాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరీ తెరకెక్కించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో అ..ఆ, భీష్మ లాంటి విజయాల తర్వాత నితిన్ చేసిన సినిమా రంగ్ దే. ఈ సినిమా మొదటి 4 రోజులు మంచి వసూళ్లు సాధించింది. దీని జోరు చూసి కచ్చితంగా నితిన్ మరో విజయం అందుకుంటాడని అంతా అనుకున్నారు. అయితే నాలుగు రోజుల తర్వాత రంగ్ దే జోరు తగ్గిపోయింది. సెలవులు లేకపోవడం.. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో రంగ్ దే కలెక్షన్స్‌పై భారీ ప్రభావమే పడింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ వచ్చేసింది.

 రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా వెంకీ అట్లూరి తెర‌కెక్కిన ఈ చిత్రం జీ5 లో విడుదల కానుంది. రిలీజైన మూడు నెలల తర్వాత విడుదల అవుతోంది.జూన్‌ 12 నుంచి జీ5లో రంగ్‌దే సినిమా స్ర్టీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మించిన చిత్రం ఇది.  ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. 

 ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటించారు.ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశీ, రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి

Follow Us:
Download App:
  • android
  • ios