రామాయణం ఆధారంగా మరో సినిమా రాబోతుంది. ఇందులో రణ్‌బీర్, యష్, సాయి పల్లవి నటించనున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఇండియన్ సినిమా బాక్సాఫీసు లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు భారీ స్కేల్‌లో తీసిన సినిమాలు భారీ వసూళ్లని రాబడుతున్నాయి. దీంతో ప్రయోగాలకు మేకర్స్ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రామాయణం ఆధారంగా `ఆదిపురుష్` చిత్రం వచ్చింది. ప్రభాస్ రాముడిగా నటించారు. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. ఈ మూవీ డిజప్పాయింట్ చేసింది. కొత్తగా చెప్పలేకపోవడం, డెంప్త్ లోకి వెళ్లలేకపోవడం, విజువల్స్ నాసిరకంగా ఉండటం, ప్రభాస్ చాలా వరకు యానిమేటెడ్‌గా కనిపించడంతో ఆడియెన్స్ తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో రామాయణం రాబోతుంది. రామాయణం ఆధారంగా మరో సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ జరుగుతుంది. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి దీన్ని రూపొందించబోతున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రావణుడిగా `కేజీఎఫ్` స్టార్ యష్ నటిస్తారని సమాచారం. ఇక సీతగా సాయిపల్లవి నటిస్తుందని తెలుస్తుంది. చాలా కాలంగా ఈ మూవీకి సంబంధించిన చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. రణ్ బీర్ కపూర్ నటించిన `యానిమల్` మూవీ ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. ఏడు వందల కోట్లు దాటి దూసుకుపోతుంది. వెయ్యి కోట్ల దిశగా రన్ అవుతుంది. దీంతో నిర్మాతకు ధైర్యం వచ్చింది. ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సరికొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నారట. మార్చిలో సినిమాని స్టార్ట్ చేయబోతున్నారట.
రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నారు. తనకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే. కొన్నాళ్లపాటు కూతురుతో ఆడుకోవాలనుకుంటున్నారు రణ్‌బీర్. ఫ్యామిలీకే టైమ్ కేటాయించాలని భావిస్తున్నారు. ఆరు నెలల పాటు ఆయన బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఈ మూవీని స్టార్ట్ చేయబోతున్నారట. ఈ మూవీని మూడు పార్ట్ లుగా తెరకెక్కించబోతున్నారట. మొదటి పార్ట్ ని 2025లో విడుదల చేయాలనుకుంటున్నారట. సినిమాలో హనుమంతుడి పాత్రని సన్నీ డియోల్ పోషించే అవకాశం ఉందట.
