బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సెలబ్రిటీలంతా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కత్రినా కూడా రెండేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అయింది.

ఈ రెండేళ్లలో ఆమె 21.5 మిలియన్ల ఫాలోవర్లను సాధించింది. తాజాగా ఈ బ్యూటీ అర్భాజ్ ఖాన్ నిర్వహించే 'పించ్' అనే షోకి హాజరైంది. ఈ సందర్భంగా తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ గురించి ఓ సీక్రెట్ చెప్పేసింది.

మొదట అర్భాజ్ 'కత్రినా మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ ఉందా..? వేరే వాళ్లను సీక్రెట్ గా ఫాలో అవుతుంటారా..?' అని ప్రశ్నించగా.. దానికి ఆమె 'లేదు.. లేదు.. కానీ రణబీర్ కు ఉంది.. అసలు ఈ ఇన్స్టా గ్రామ్ ఎలా పని చేస్తుందో నాకు చూపించిందే రణబీర్' అని చెప్పింది. రణబీర్ సంగతి అడగకుండానే కత్రినా అతడి సీక్రెట్ బయటపెట్టేసింది. మరి ఈ విషయంపై రణబీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఇక కత్రినా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ తో కలిసి 'భారత్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాది జూన్ లో ఈద్ సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే అక్షయ్ కుమార్ తో 'సూర్యవంశీ' అనే సినిమాలో నటిస్తోంది. అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు సైన్ చేసింది.