తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కేందుకు రెడీగా ఉంది.   


ఈ మధ్యకాలంలో హిందీ సినీ పరిశ్రమలో బయోపిక్ లదే ఎక్కువగా హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది క్రీడ రాజకీయ సినీ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథ ఆధారంగానే బయోపిక్లను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు తెలియని ఎన్నో కొత్త విషయాలను అటు సినిమాలతో తెలియజేస్తూ సూపర్ హిట్ కొడుతున్నారు. ఇలా ఇటీవల కాలంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఎన్నో బయోపిక్ లు మంచి ఆదరణ సొంతం చేసుకున్నావుంటాయి. ఆ క్రమంలోనే క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ లు ఇప్పటివరకు ఎన్నో సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 

అలాగే క్రికెటర్ల బయోపిక్ లు ఘన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కపిల్ దేవ్, టెండూల్కర్, ధోనీ తదితరుల బయోపిక్ లు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కేందుకు రెడీగా ఉంది. ఈ చిత్రంలో గంగూలీ పాత్రను బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గంగూలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి వెల్లడించారు. 

ఈ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే పలు మార్లు సిట్టింగులు జరిగినప్పటికీ రణబీర్ డేట్లు కుదరకపోవడంతో అప్పట్లో డీల్ కుదరలేదని... ఇప్పుడు డేట్లు కుదరడంలో డీల్ ఓకే అయిందని ఆయన చెప్పారు. గంగూలీ నుంచి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు దర్శకుడితో కలిసి రణబీర్ త్వరలోనే కోల్ కతాకు వెళ్తున్నారని చెప్పారు. హీరో రణబీర్ కపూర్ తో పాటు దర్శకుడు కోల్కతా వెళ్లి క్యాబ్, ఈడెన్ గార్డెన్స్ మైదానం, గంగూలి ఇంటిని సందర్శించబోతున్నారట. అంతేకాదు ఇక గంగూలి కెరీర్ లో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా తెలుసుకొని ఇక కథలో చేర్చబోతున్నారు అన్నది తెలుస్తూ ఉంది.

గంగూలీ బయోపిక్ పై అతని భార్య డోనా గంగూలీ స్పందించింది. ఈ మూవీపై ప్రొడ్యూసర్లు, డైరెక్టరే స్పందించాలని అభిప్రాయపడింది. మరి గంగూలీ పాత్రలో ఎవరిని చూడాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకూ ఆమె స్పందించింది.

"నా ఫేవరెట్స్ గురించి తెలుసుకోవాలంటే అమితాబ్ బచ్చన్ లేదంటే షారుక్ ఖాన్ అంటాను. కానీ వయసు రీత్యా వాళ్లు ఈ సినిమాకు సరిపడరు. 24 ఏళ్ల గంగూలీలా కూడా కనిపించాలి. సినిమా చాలా వరకూ ఈ వయసులో ఉన్న గంగూలీ చుట్టే తిరుగుతుంది. అందువల్ల ఆ వయసుకు తగిన నటుడిని ఎంపిక చేయడం మంచిది" అని డోనా అభిప్రాయపడింది.

 ఇక ఈ బయోపిక్ కోసం అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే, ఈ చిత్ర దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.