బాలీవుడ్‌ క్రేజీ లవ్‌ జోడీ రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ గురువారం గ్రాండ్‌గా వివాహం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే కోడలు అలియాభట్‌పై రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌ ఫస్ట్ టైమ్‌ రియాక్ట్ అయ్యింది.

బాలీవుడ్‌కి పెళ్లి కళ వచ్చింది. హిందీలో చిత్ర పరిశ్రమలో రెండు బిగ్‌ ఫ్యామిలీస్‌ ఒక్కటి కాబోతున్న సందర్భంగా ఆద్యంతం పండగ వాతావరణం నెలకొంది. కపూర్‌ ఫ్యామిలీకి చెందిన మూడో తరం వారసుడు రణ్‌బీర్‌ కపూర్‌, ప్రముఖ దిగ్గజ ఫిల్మ్ మేకర్‌ మహేష్‌ భట్‌ కూతురు, హీరోయిన్‌ అలియాభట్‌ వివాహం గురువారం గ్రాండ్‌గా జరుగుతుంది. అతికొద్ది మంది బంధుమిత్రులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహం జరగబోతుండటం విశేషం. 

దీంతో రణ్‌బీర్‌ ఫ్యామిలీ, ఇటు అలియాభట్‌ ఫ్యామిలీ సభ్యులు వీరి పెళ్లి హడావుడిలో ఉన్నారు. కొద్దిమందితోనే గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నారు. అయితే తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌ తల్లి ఆయన మ్యారేజ్‌పై, తనకు కాబోయే కోడలిపై స్పందించింది. ముఖ్యంగా కోడల అలియాపై ప్రశంసలు కురిపించడం విశేషం. పెళ్లి వేదికకు చేరుకునే సమయంలో రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌ మీడియా కంట పడింది. మీడియా ఆమెని స్పందించాలని ఒత్తిడి తీసుకురాగా, ఎట్టకేలకు నోరు విప్పింది. 

`ఈ రోజు రణ్‌బీర్‌, అలియాభట్‌ల పెళ్లి రణ్‌బీర్‌ నివాసం వాస్తు నిలయంలోనే జరుగుతుంది. నా కోడలి గురించి ఏం చెప్పాలి. నా కోడలు ది బెస్ట్` అని కితాబిచ్చింది. తన మరదలు చాలా క్యూట్‌ అని, రణ్‌బీర్‌, అలియా జంట చూడముచ్చటగా ఉంటుందని నీతూ కపూర్‌ కూతురు రిద్దిమా చెప్పారు. నిజానికి 2020లోనే ఆలియా–రణబీర్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌ చేశారు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేశారు. దానికి సంబంధించి కొన్ని పనులు కూడా పూర్తి చేశారు.

కరోనా విజృంభించడంతో, అప్పటికే కమిట్‌ అయిన సినిమాలతో బిజీగా ఉండడంతో పెళ్లి వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ఆలియా తన పాన్వెల్‌ బంగ్లాతో పెళ్లి ప్లాన్‌ చేసింది. కానీ ఇప్పుడు వేదిక మారింది. రణబీర్‌ కపూర్‌ వాస్తు నిలయంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే రణ్‌బీర్‌, అలియాభట్‌ కలిసి ప్రస్తుతం `బ్రహ్మాస్త్ర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.