Asianet News TeluguAsianet News Telugu

రాముడిగా రణ్ బీర్.. సీతగా ఆలియా.. రావణుడిగా కెజియఫ్ హీరో యష్...ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిజమేనా..?

ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ మీద పడింది. బాహుబలి తరువాత భారీ ప్రాజెక్ట్ లు తీయ్యడానికి మేకర్స్ ధైర్యం చేస్తున్నారు. ఈక్రమంలోనే మైథలాజికల్ సినిమాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా బాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ తో.. భారీ స్థాయిలో రామాయణం తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. 

Ranbir and Alia Bhatt with KGF Hero Yash In Ramayan Movie JMS
Author
First Published Jul 20, 2023, 10:31 PM IST


బాహుబలి తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రీమ్ ప్రాజెక్ట్స్..డ్రీమ్ రోల్స్ అంటూ.. తమ కోరికలను ధైర్యంగా తీర్చుకుంటున్నారు మేకర్స్. బాహుబలి చూసిన తరువాత తాను అనుకున్న పొన్నియన్ సెల్వన్ తీయ్యడానికి ధైర్యం చేశానని.. రాజమౌళి తనకు ఆదర్శం అంటూ..మణిరత్నం ఎన్నో సార్లు చెప్పారు. అంతే కాదు రీసెంట్ గా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాతో రామాయణాన్ని ఆవిష్కరించి అద్భుతం చేశారు. అలా తమకు ఉన్న డ్రీమ్ రోల్స్.. డ్రీమ్ ప్రాజెక్ట్స్ ను తీర్చుకుంటున్నారు మేకర్స్. ఇలా ఇండస్ట్రీలో తెరకెక్కాల్సిన భారీ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. 

 ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని, డ్రీమ్ రోల్స్ అని ఉంటాయి. రాజమౌళి కి మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే.. స్టార ప్రోడ్యూసర్  అల్లు అరవింద్ కి రామాయణం  డ్రీమ్ ప్రాజెక్ట్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో రామాయణం పై ఎన్నో సినిమాలు వచ్చాయి. వెనకట వచ్చిన రామాయణం నుంచి నిన్న మొన్న వచ్చిన ఆదిపురుష్ వరకూ.... ఎన్నో సినిమాలు రామాయణం ఆధారంగా వచ్చాయి.  రకరకాల పాయింట్స్ తీసుకుని రామాయణాన్ని సినిమాలుగా తీశారు. 

అయితే అల్లు అరవింద్.. మధు మంతెన, నమిత్ మల్హోత్రాతో కలిసి రామాయణం సినిమా నిర్మించాలని అనుకున్నారు. ఈ ప్రకటన వచ్చి దాదాపుగా మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందా? అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం  ఈ సినిమా ఆగిపోలేదని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం ఇస్తున్నారు. అంతే కాదు ప్రస్తుతం సోషల్ మీడియా సమాచారం ప్రకారం  ఈ ఏడాది చివర్లో  రామాయణం రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే యోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. డైరెక్టర్ నితీష్ తివారి ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని బాలీవుడ్‌‌లో సర్కిల్ లో వినిపిస్తున్న  టాక్.

ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. నటీనటుల ఎంపిక గురించి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.  బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి.. రామాయణం ప్రాజెక్టులో రాముడు, సీత లక్ష్మణుడు, హనుమంతుడు, రావణ పాత్రల కోసం కొంత మంది స్టార్స్ ను లుక్ టెస్ట్ చేస్తున్నాడట.  ఇక షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ భారీ ప్రాజెక్ట్ లో..  రాముడుగా రన్ బీర్ కపూర్, సీతగా అలియా భట్, రావణుడి పాత్రలో కెజియఫ్  స్టార్ యష్ నటించనున్నారని, ప్రస్తుతం ఈ పాత్రలకు సంబంధించి వీరి మీద లుక్ టెస్ట్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios