కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన పాత్రలను ఎంచుకుటూ వస్తున్న హీరో రానా. ఆయన నటించిన ‘అరణ్య’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. ప్రస్తుతం ఆయన ‘విరాట పర్వం’లో నటిస్తున్నారు. అలాగే మరిన్ని కొత్త ప్రాజెక్టులు, కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

మెగా హీరో సినిమాలో రానా ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నాడంటూ మీడియాలో వస్తున్న వార్తలు దుమారం లేపుతున్నాయి.. ఆ మెగా హీరో మరెవరో కాదు… చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం రానా అయితే బాగుంటుందని భావించి క్రిష్ రానా ని సంప్రదించినట్లు, రానా కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ పాత్ర ఓ మోతుబరి పాత్ర అని ప్రచారం అవుతోంది. 

డైరెక్టర్ క్రిష్ కు రానాకి మధ్య ఒక మంచి రిలేషన్ ఉంది. వీరిద్దరూ కలిసి కృష్ణం వందే జనార్దనం సినిమా  చేసారు. అప్పటినుండి వీరి మధ్య అనుభందం ఏర్పడింది. అందుకే క్రిష్ అడగగానే రానా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.. రానా ఎంట్రీతో ఈ సినిమాకి మంచి క్రెజ్ వచ్చే అవకాశం ఉందిని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా హిందీ శాటిలైట్, డిజిటిల్ రైట్స్ కు డిమాండ్ ఏర్పడుతుంది !! అయితే, దీనిపై రానా, చిత్ర టీమ్  నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. 

ర‌కుల్ ప్రీత్ సింగ్‌-వైష్ణ‌వ్ తేజ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్నఈ మూవీని అవార్డు విన్నింగ్ తెలుగు న‌వల కొండ‌పొలం ఆధారంగా తెర‌కెక్కిస్తున్నాడు క్రిష్‌. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి ఈ న‌వ‌ల‌ను రాశారు. క్రిష్ ఈ న‌వ‌లలోని కంటెంట్ ను  త‌న‌దైన స్లైల్ లో ప్రేక్ష‌కుల‌ను అందించేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.