శర్వానంద్  నటించిన రణరంగం సినిమా ఆగస్ట్ 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో పాజిటివ్ గా దూసుకుపోతోంది. ఫైనల్ గా సౌండ్ కౌంట్ పేరుతో ట్రైలర్ ను కూడా వదిలారు. చిత్ర యూనిట్ కోరిక మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. 

టీజర్ తోనే సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు స్ట్రాంగ్ గా పెరుగుతుండగా ఇప్పుడు సౌండ్ కట్ కూడా మోత మోగిస్తోంది. సౌండ్ మిక్సింగ్ తో డిఫరెంట్ మ్యాజిక్ చేశారనిపిస్తోంది. శర్వా డిఫరెంట్ లుక్స్ తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. యాక్షన్ మోడ్ ని అలాగే ఎమోషన్ ని దర్శకుడు సుధీర్ కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడనిపిస్తోంది. 

సినిమా క్లిక్కయితే శర్వానంద్ కెరీర్ కి బాగా ప్లస్సవుతుంది. పడి పడి లేచే మనసు సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఈ హీరో రణరంగం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శిని - కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.