టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఆగస్ట్ 15న ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని రణరంగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరెంట్ గ్యాంగ్ స్టార్ తో వచ్చిన ఈ యువ హీరో మొదటిరోజు  మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు చాలా వరకు మిక్సిడ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ అయితే పాజిటివ్ గానే దక్కాయి. 

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రణరంగం సినిమా 3.83కోట్ల షేర్స్ ని సాధించినట్లు తెలుస్తోంది. శర్వా కెరీర్ అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమా ఇదే. ఇకపోతే యూఎస్ సినిమా ప్రీమియర్స్ పడకపోవడం కొంత దెబ్బె అని చెప్పాలి. లేకుంటే కలెక్షన్స్ డోస్ ఇంకాస్త పెరిగి ఉండేది. ఇక ఏరియల వారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. 

రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్ 
నైజాం........ 1.41కోట్లు  

సిడెడ్......... 0.45 కోట్లు  

వైజాగ్......... 0.51 కోట్లు  

ఈస్ట్............ 0.37 కోట్లు  

వెస్ట్............. 0.28 కోట్లు  

కృష్ణ............ 0.24 కోట్లు  

గుంటూరు.....0.37 కోట్లు  

నెల్లూరు........ 0.20కోట్లు