ఆగస్ట్ 15 రిలీజైన టాలీవుడ్ చిత్రాలు రణరంగం - ఎవరు. ఈ రెండు సినిమాలకు మొదటి నుంచి పాజిటివ్ టాక్ ఉంది. టీజర్ అండ్ ట్రైలర్స్ తో అడివి శేష్ - శర్వానంద్ మంచి బజ్ క్రియేట్ చేశారు. కానీ సినిమాల ఫలితాలు ఒక్క షోతో మారిపోయాయి. 

సప్సెన్స్ థ్రిల్లర్ తో వచ్చిన అడివి శేష్ ఎవరు సినిమా ఒక రోజు ముందు గానే మీడియా ముందుకు వచ్చింది. సినిమా మీద నమ్మకంతో వేసిన ప్రివ్యూలకు పాజిటివ్ రేటింగ్స్ వచ్చాయి. కానీ శర్వా రణరంగం మాత్రం అనుకున్నంతగా క్లిక్కవ్వలేదు. సినిమాకు రివ్యూలు కూడా అంతగా కలిసి రాలేదు,. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ రొటీన్ గానే ఉన్నట్లు టాక్ వస్తోంది. 

కలెక్షన్స్ కూడా చెప్పుకోదగ్గ రేంజ్ లో రాలేవు. ఎవరు సినిమాకి మాత్రం పాజిటివ్ టాక్ తో పాటు మంచి ఓపెనింగ్స్ అందాయి. శర్వానంద్  ప్రమోషన్స్ విషయంలో కాస్త స్లో అయినట్లు అర్ధమవుతోంది. ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో ఎంతో కొంత రణరంగం హడావుడి కనపడుతుంది అనుకుంటే.. ఊహించనంతగా లేదు. కానీ ఎవరు హడావుడి మాత్రం గట్టిగానే ఉంది. మరి మొదటిరోజు ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో కలక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి.