యంగ్‌ హీరో నాగశౌర్యకి వార్నింగ్‌ ఇచ్చారు భళ్లాలదేవ రానా. అమాయకంగా కనిపించే వ్యక్తులతో జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

యంగ్‌ హీరో నాగశౌర్యకి రానా వార్నింగ్‌ ఇచ్చాడు. ఆయనతో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈజీగా నమ్మకూడదని చెప్పారు. మరి ఇంతకి వీరి మధ్య ఏం జరిగింది. నాగశౌర్యకి రానా ఎందుకు వార్నింగ్‌ ఇవ్వాల్సి వచ్చిందనేది చూస్తే.. ఇటీవల తాను నటిస్తున్న చిత్రానికి సంబంధించిన స్టిల్‌ని పంచుకున్నాడు నాగశౌర్య. బ్రహ్మాజీతో దిగిన ఫోటో ఇది. ఇద్దరూ నామాలు పెట్టుకుని ఉన్నారు. ఈ సందర్భంగా నాగశౌర్య ట్వీట్‌ చేస్తూ `నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్‌ తనకి ఉండాలి. దయచేసి యంగ్‌ టాలెంట్‌ని ప్రోత్సహించండి` అని సరదాగా ట్వీట్‌ చేశాడు.

ఇందులో బ్రహ్మాజీ చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఆయన లుక్‌లో తేడా ఉందట. ఈ విషయాన్ని రానా ట్వీట్‌ చేశాడు. నాగశౌర్య ట్వీట్‌ని రీ ట్వీట్‌ చేస్తూ, `వామ్మో ఇదేంటి గురు! నాగశౌర్య.. దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. బ్రహ్మాజీ చూపు నాకేంటో తేడాగా కనిపిస్తోంది. నువ్వు ఏమంటావ్‌?` అని రిప్లై ఇచ్చాడు. దీనిపై శౌర్య కూడా ప్రతిస్పందించారు. `నువ్వు చెప్పింది కరెక్ట్‌ భయ్యా. నాకూ ఏదో తేడాగా అనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాల్సిందే` అని కామెంట్‌ చేయడం ఆకట్టుకుంటుంది.

Scroll to load tweet…
Scroll to load tweet…

ఇలా వీరి మధ్య సరదాగా సంభాషణ సాగింది. ఇక, సినిమా విషయానికి వస్తే, లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనీష్‌ కృష్ణా దర్శకత్వం వహిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో షీర్లే సేతియా కథానాయిక. సీనియర్‌ నటి రాధిక ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలోని ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలతో పాటుగా, ప్రేక్షకులు అమితంగా ఎంటర్‌టైన్‌ చేసే హీలేరియస్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్‌.