Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్ః `విరాటపర్వం` వాయిదా.. అఫీషియల్‌

కరోనా తగ్గుముఖం పట్టేంత వరకు వెచి ఉండాలని సినిమా మేకర్స్ నిర్ణయించుకుంటున్నారు. అందులో భాగంగానే తమ సినిమా విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే `లవ్‌స్టోరి`, `టక్‌ జగదీష్‌` సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా `విరాటపర్వం` కూడా అందులో చేరింది.

rana sai pallavi starrer virataparvam movie post pone  arj
Author
Hyderabad, First Published Apr 14, 2021, 4:50 PM IST

కరోనా సెకండ్‌ వేవ్‌ మరింతగా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ప్రపంచంలోనే రోజువారిగా అత్యధిక కేసులు నమోదవుతున్న దేశంగా భారత్‌ నిలిచింది. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇండియాకి చెందిన వారే ఉండటం విచారకరం. దీంతో కరోనా తీవ్రత ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం సినిమాలపై పడుతుంది. థియేటర్ లోకి జనాలు వందల మంది వస్తే అది మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

అందుకే కాస్త తగ్గుముఖం పట్టేంత వరకు వెచి ఉండాలని సినిమా మేకర్స్ నిర్ణయించుకుంటున్నారు. అందులో భాగంగానే తమ సినిమా విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే `లవ్‌స్టోరి`, `టక్‌ జగదీష్‌` సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు సాయిపల్లవి, రానా నటించిన `విరాటపర్వం` కూడా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 30న విడుదల కావాల్సిన సినిమాని వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపింది. అందరు మాస్క్ ధరించి, జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే ఈ చిత్ర దర్శకుడు వేణు ఉడుగులకి ఇటీవల కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. అయితే కరోనా వల్ల షూటింగ్‌ పనులు, పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు ఆగిపోయాయి. వాయిదాకి ఇది కూడా ఓ కారణమని తెలుస్తుంది. దీంతోపాటు ఇటీవల `తలైవి` సినిమా వాయిదా పడింది. అలాగే మేలో రాబోతున్న `ఆచార్య`, `నారప్ప`, `అఖండ`, `ఖిలాడీ` చిత్రాలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో దాదాపు రెండు నెలలు థియేటర్లు మొత్తం ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios