యంగ్ హీరోలు ఒకరికి ఒకరు సాయిం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కెరీర్ లో వెనక బడ్డ హీరోలకు చేయూతని ఇవ్వటంలో ముందు ఉంటున్నారు. గత కొంతకాలంగా రాజ్ తరుణ్ కు కెరీర్ పరంగా కలిసొచ్చిందేమీ లేదు. వరస ఫ్లాఫ్ లతో ఆయన దుసుకుపోయారు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21F తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు పడలేదు. గత మూడు సంవత్సరాలుగా వచ్చి సినిమా వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోతోంది.

ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో ఇద్దరి లోకం ఒక్కటే అనే చిత్రం చేస్తున్నారు.  అయితే తాజాగా రానా దగ్గుపాటి ..రాజ్ తరుణ్ సినిమాని ప్రొడ్యూస్ చేయటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.గతంలో రాజ్ తరుణ్ తో లవర్ చిత్రం డైరక్ట్ చేసిన అనీష్ కృష్ణ ఈ సినిమాని డైరక్ట్ చేయనున్నారు. రీసెంట్ గా రానాని కలిసి ఓ కథను నేరేట్ చేసారు అనీష్.

చాలా చిన్న బడ్జెట్ లో అయ్యే ఆ కథ ని వెంటనే రానా లాక్ చేసి, ఎవరితో చేద్దామనుకుంటున్నావ్ అని అడిగారు. దానికి వెంటనే అనీష్ ..తాను రాజ్ తరుణ్ తో చేద్దామనుకుంటున్నట్లు చెప్పారు. రానా మనస్సులో కూడా రాజ్ తరుణ్ తో ఓ సినిమా చెయ్యాలనే ఆలోచన ఉందిట. దాంతో వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. 

అనీష్ తెచ్చిన కథ ఖచ్చితంగా రాజ్ తరుణ్ కు బ్రేక్ ఇచ్చి మళ్లీ ఫామ్ లోకి తెచ్చేదని నమ్ముతున్నారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వరస పెట్టి చిన్న సినిమాలు వస్తున్నాయి. కొత్త తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వాటి సరసన ఈ సినిమా నిలుస్తుందని తెలుస్తోంది. మొత్తానికి రానా నిర్మాతగా రాజ్ తరణ్ హీరోగా సినిమా అంటే ఓపినింగ్స్ కూడా బాగానే ఉంటాయి.