బాహుబలి కాంబినేషన్ దగ్గుపాటి రానా, ప్రభాస్ ఎంతలా క్లిక్ అయ్యిందో తెలిసిందే. వీళ్లిద్దరి కాంబో కు ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఈ నేపధ్యంలో వీళ్లిద్దరూ కలిసి స్క్రీన్ ని మరోసారి షేర్ చేసుకోవటానికి రంగం సిద్దమైనట్లు సమాచారం. అయితే ఎక్కువ సేపు కాదు. రానా కొద్దిసేపు మాత్రమే గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టాక్స్ జరిగాయట. అదే గనుక జరిగితే ఆ సీన్ కు మామూలుగా థియోటర్ లో రెస్పాన్స్ రాదు. ఇంతకీ ఏ సినిమాలో అంటారా...

‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రానా అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రానా కనిపించేది కొద్ది సేపే అయినా గుర్తుండిపోయే పాత్ర  అని చెప్తున్నారు. మొదట గోపీచంద్ తో ఈ సీన్స్ తీద్దామనుకున్నారట కానీ వీరి కాంబోకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. 

ఇక షూటింగ్ విషయానికి వస్తే...ఈ నెల రెండో వారం నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్‌ షూట్ ను హైదరాబాద్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రం టీమ్. ఇప్పటికే  ఈ షెడ్యూల్‌ కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ నేతృత్వంలో ఐదు కోట్ల ఖర్చుతో ఓ ఆస్పత్రి సెట్‌ని తీర్చిదిద్దారు. ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతదర్శకుడు. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. కరోననాతో బ్రేక్ పడింది. ఇక ఈ హాస్పటిల్ సెట్..నాలుగు ప్లోర్ లు కలిగి ఉంటుంది. అలాగే ఐసీయు వార్డ్, స్పెషల్ వార్డ్ , జనరల్ వార్డ్, డాక్టర్ రూమ్స్ రెడీ చేస్తున్నారు. ఈ సెట్ లో దాదాపు ఓ నెల పాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.  

అలాగే  ప్రభాస్ కొత్త సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం రాధేశ్యాయ్ అనే టైటిల్‌ని చిత్రానికి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది. 

ఇక బాహుబలి చిత్రంతో నేషనల్ స్టార్‌గా మారాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన సాహో సినిమా ఆశించిన స్థఆయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోవడంతో.. ఇప్పడు తన కొత్త సినిమాపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.   ప్రభాస్ తన 21వ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.