కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో సినిమాల నుంచి బ్రేక్‌ రావటంతో యంగ్‌ హీరోలు వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెట్టారు. ఈ ఖాళీ సమయంలో పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారు అవుతున్నారు తారలు. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ పెళ్లి చేసుకోగా, సీనియర్‌ నిర్మాత దిల్‌ రాజు కూడా రెండో వివాహం చేసుకున్నాడు. ఇక మరో యంగ్ హీరో నితిన్‌ ఈ నెల 26న పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

తాజాగా మరో యంగ్ హీరో కూడా పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. దగ్గుబాటి వారసుడు రానా, లాక్ డౌన్‌ సమయంలోనూ తాను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేశాడు. ఇంటీరియర్‌ డిజైనర్‌ మిహీకా బజాజ్‌ తన ప్రేమను అంగీకరించిందంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు రానా దగ్గుబాటి. వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు.

తాజాగా ముహూర్తం ఫిక్స్ చేసిన దగ్గుబాటి, బజాజ్‌ ఫ్యామిలీలు ఆసక్తికరంగా ఓ ఇన్విటేషన్‌ను రిలీజ్ చేశారు. మయాబజార్‌ సినిమాలోని సన్నివేశంతో ఈ వీడియో ఇన్విటేషన్‌ను డిజైన్‌ చేశారు. ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి జరగనున్నట్టుగా తెలిపారు. హైదరాబాద్‌, మణికొండలోని చైతన్య ఎంక్లేవ్‌ ఈ వేడుకకు వేదిక కానుంది. కరోనా లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటిస్తూ పెళ్లి జరిపిచేందుకు నిర్ణయించారు పెద్దలు.