దగ్గుబాటి హీరోలు రానా, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

దగ్గుబాటి హీరోలు రానా, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనితో రానా, వెంకటేష్ రంగంలోకి దిగి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. రానా, వెంకటేష్ పూర్తి స్థాయిలో కలసి నటించిన తొలి ప్రాజెక్టు కావడంతో ఆసక్తి నెలకొంది. 

ఇదిలా ఉండగా రానా జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తెలుగు చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా హిందీలో రాణించడం గురించి మాట్లాడాడు. తెలుగు సినిమాలు ప్రస్తుతం హిందీలో బాగా రాణిస్తున్నాయి. నేను హిందీలో ఘాజి చిత్రంలో నటించా. ఆ తర్వాత తెలుగు చిత్రాలు చేశా. 

ఇప్పటికి సినిమాని భాష పేరుతో అనవసరంగా వేరు చేసి చూస్తున్నాం. భాషా బేధాలు సినిమా రంగంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే రోజు వస్తుంది. నేను బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు బాలీవుడ్ లో నాకున్న ఒక ఫ్రెండ్ ని మీట్ అయ్యా. అతడికి బాహుబలి గురించి చెప్పా. 

హీరో ఎవరు అని అడిగాడు.. ప్రభాస్ అని చెప్పా. ప్రభాస్ ఎవరు అని తిరిగి ప్రశ్నించాడు. దీనితో నేను షాక్ అయ్యా.. వెంటనే ప్రభాస్ నటించిన సూపర్ హిట్ సినిమాలు చెప్పా. ఒక్క చిత్రం కూడా చూడలేదు అని చెప్పాడు. నాకు టాలీవుడ్ లో చిన్ను భర్త మాత్రమే తెలుసు అని చెప్పాడు. 

చిన్నూ ఎవరు అని నేను ఆలోచిస్తుండగా నమ్రత శిరోద్కర్ అని చెప్పాడు. నమ్రత భర్తగా మహేష్ బాబు తెలియడం ఏంటి అని నేను మరింత ఆశ్చర్యానికి గురయ్యా. నాలుగేళ్లు ఆగండి. మా టాలీవుడ్ ఆర్మీ మొత్తం బాలీవుడ్ లోకి దిగుతుంది అని చెప్పా. నేను చెప్పిందే నిజం అయింది అని అతడు నాతో చెప్పాడు. ప్రస్తుతం సౌత్ పాన్ ఇండీయా చిత్రాలు బాలీవుడ్ ని ఓవర్ టేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రానా మాత్రం కాస్త వెనుకబడ్డాడు.