ఇప్పుడున్న హీరోల్లో రానా దగ్గుపాటి కు ఉన్న స్దానం అతి ప్రత్యేకం. అటు నెగిటివ్ రోల్స్ చేస్తూ..ఇటు హీరో రోల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. బాహుబలి తర్వాత ఆయన మార్కెట్ మూడు రెట్లు అవటం, ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడటంతో రానా కొద్ది సేపు తమ సినిమాలో కనిపించినా చాలు అనుకునే పరస్దితి నిర్మాతలది. ఎందుకంటే ఆ మేరకు ఫ్యాన్స్ లో ఎక్సెపెక్టేషన్స్ పెరగటమే కాదు బిజినెస్ సైతం రెట్టింపు అవుతుంది. ఇతర భాషల్లో మంచి రేటు పలుకుతుంది. అందుకేనేమో రానా తన సొంత బ్యానర్  లో షూటింగ్ జరుపుకుంటున్న వెంకీ మామ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నట్లు సమాచారం. గతంలో వెంకటేష్ సైతం రానా సినిమా కృష్ణం వందే జగద్గురుమ్ లో కొద్ది సేపు కనపడ్డారు. 

ఇక ‘ఎఫ్‌2’తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్‌..  ‘వెంకీమామ’ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నిజ జీవిత మేనమామ వెంకీతో ..నాగ చైతన్య  కలిసి నటిస్తుండటంతో.. ఈ మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. చాలా కాలంపాటు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ.. ప్రస్తుతం జెట్‌స్పీడ్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. 

 రియల్‌ లైఫ్‌లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా మామా అల్లుళ్లలా నటిస్తున్నారు వెంకీ, నాగచైతన్య. రైతు పాత్రలో వెంకటేశ్, ఆర్మీ ఆఫీసర్‌గా నాగచైతన్య కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.