గత రాత్రి రానా ఎవరితో గడిపాడు..? సీరియస్ అయిన సురేష్ బాబు

rana daggubati at filmfare awards 2018
Highlights

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి అవార్డులు ప్రధానం చేస్తుంటారు. ఈ ఏడాది ఫిలిం ఫేర్ అవార్డు ఫంక్షన్ కూడా అట్టహాసంగా జరిగింది

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి అవార్డులు ప్రధానం చేస్తుంటారు. ఈ ఏడాది ఫిలిం ఫేర్ అవార్డు ఫంక్షన్ కూడా అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భముగా ఉత్తమ చిత్రాలకు, నటీనటులను అవార్డులు అందించారు. ఈ ఈవెంట్ ను హీరో సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, ఈషా రెబ్బా కలిసి హోస్ట్ చేశారు. తాజాగా ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేశారు.

ఈ సందర్భంగా.. బాహుబలి2 సినిమాకు గాను చాలా అవార్డులు లభించాయి. ఉత్తమ సహాయ నటుడిగా రానా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రానాను రాహుల్, సందీప్ లు కాసేపు స్టేజ్ పై కొన్ని చిలిపి ప్రశ్నలు వేశారు. జియో భవిష్యవాణికి ఫోన్ చేసి రానాకి ఎందుకు పెళ్లి కావడం లేదని అడిగారు.. అంతటితో ఆగకుండా గత రాత్రి ఆయన ఎవరితో గడిపారో చెప్పండి అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నతో స్టేజ్ కింద కూర్చొన్న సురేష్ బాబు ముఖంలో కదలికలు మారిపోయాయి. ఆయన కాస్త సీరియస్ అయినట్లుగా కనిపించారు. దీన్ని గమనించిన రానా వెంటనే.. ఈ రాత్రికి మాత్రం ఫిలిం ఫేర్ లో ఉన్నానని చెప్పి ఆ టాపిక్ కు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశారు. 

loader