సీనియర్ హీరో వెంకటేష్.. ఇతర హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ లతో కలిసి నటించిన వెంకీ ఇప్పుడు తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' సినిమా చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా.. వెంకీ ఇప్పుడు తన అన్నయ్య కొడుకు రానాతో కలిసి సినిమా చేయబోతున్నట్లు టాక్. చాలా కాలంగా ఈ కాంబినేషన్ లో కథ కోసం చూస్తున్నారు. అది ఇప్పటికి సెట్ అయిందని అంటున్నారు.

కొద్దిరోజుల క్రితం దర్శకుడు వీరు పోట్ల.. వెంకటేష్ కి ఓ కథవినిపించాడు. అది మల్టీస్టారర్ కథ. ఒక హీరోగా వెంకీ మరో హీరోగా రవితేజ అనుకున్నారు. కానీ ఇప్పుడు రవితేజకి బదులుగా రానాని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.

అన్నీ కుదిరితే సురేష్ బాబు, అనీల్ సుంకర సంయుక్తంగా సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రానప్పటికీ ఈ కాంబినేషన్ లో సినిమా మాత్రం ఖాయమంటున్నారు.